తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పార్కింగ్​లోని కారులో రూ. 7 కోట్ల విలువైన గోల్డ్ బిస్కెట్లు.. మ్యాట్​ కింద దాచిన వ్యాపారి - కేరళలో ఐటీ దాడులు

Income Tax Raids In UP : ఉత్తర్​ప్రదేశ్​ కాన్పూర్​లో పలువురు​ వ్యాపారవేత్తల ఇళ్లు, కార్యాలయాలపై ఐటీ అధికారులు దాడులు జరిపారు. ఈ క్రమంలో ఓ జ్యూవెల్లరీ షాపు యజమాని కారులో రూ. 7 కోట్ల విలువైన 12 బంగారు బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నారు.

Income Tax Raids In UP
ఉత్తర్​ప్రదేశ్​లో ఐటీ దాడులు

By

Published : Jun 25, 2023, 9:26 PM IST

Income Tax Raids In UP : పార్కింగ్​లో ఉన్న కారు మ్యాట్​కింద రూ. 7 కోట్ల విలువైన 12 బంగారు బిస్కెట్లు లభ్యమయ్యాయి. ఉత్తర్​ప్రదేశ్​ కాన్పూర్​లో ఆభరణాల వ్యాపారి రాధా మోహన్​ పురుషోత్తం దాస్ జ్యూవెల్లర్స్​పై ఐటీ అధికారులు జరిపిన దాడిలో ఇవి దొరికాయి. దీనిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టనున్నట్లు ఐటీ అధికారులు పేర్కొన్నారు.

ఇదీ కథ..
కాన్పూర్​ నగరంలో ప్రముఖ జ్యూవెల్లరీ వ్యాపారి రాధా మోహన్​ పురుషోత్తం దాస్​.. షాపు, నివాసంపై ఐటీ అధికారులు ఆదివారం దాడి చేశారు. ఈ క్రమంలో ఐటీ అధికారులకు.. మోహన్ దాస్ ఇంటి పార్కింగ్​లో ఉన్న కారులో మ్యాట్​కింద 12 బంగారు బిస్కెట్లు లభ్యమయ్యాయి. బిస్కెట్లను ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ సుమారు రూ. 7 కోట్ల దాకా ఉండవచ్చని అధికారులు తెలిపారు.

బంగారు బిస్కెట్​లకు సంబంధించి వ్యాపారి మోహన్ దాస్ వద్ద ఎటువంటి పత్రాలు లేవని ఐటీ అధికారులు తెలిపారు. వ్యాపారి వద్ద ఉన్న కోట్లు విలువచేసే బంగారు, వెండి ఆభరణాలకు సంబంధించి బిల్లులు వారి ఇంట్లో పనివారిపైన, షాపు వర్కర్ల పేరు మీద ఉన్నాయని వారు పేర్కొన్నారు. అంతేకాకుండా పన్ను ఎగవేతకు సంబంధించిన పత్రాల్లో కూడా అవకతవకలు జరిగినట్లు గుర్తించారు. ఆదాయ పన్నుకు సంబంధించిన పత్రాలను పరిశీలించగా.. వ్యాపారి వద్ద సరైన ఆధారాలు లేవని అధికారులు స్పష్టం చేశారు.

మరో వ్యాపారిపైనా దాడులు
మరోవైపు నగరంలో మరో వ్యాపారి పీయూష్ జైన్ నివాసంపై కూడా ఐటీ అధికారులు దాడులు జరిపారు. పీయాష్ జైన్ ఓ పర్​ఫ్యూమ్ వ్యాపారి. అయితే వీరిద్దరిపై జరిగిన ఐటీ దాడులు నగరంలో హాట్ టాపిక్​గా మారాయి. ఐటీ బృందాల వరుస దాడుల పట్ల కాన్పూర్​లోని ప్రముఖ వ్యాపారవేత్తలు, బిల్డర్లు భయబ్రాంతులకు గురవుతున్నారు. నగరంలోని బిల్డర్ల నివాసాలు, కార్యాలయాలపై అధికారుల దాడులు ఇంకా కొనసాగుతున్నాయి. అంతకుముందు శనివారం కూడా దాడులు జరిపిన అధికారులు 6 కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.

యూట్యూబర్లపై ఐటీ దాడులు..
Kerala Youtubers Income Tax Raid : కేరళలో ఇటీవలె ప్రముఖ యూట్యూబర్లపై ఐటీ ఆధికారులు దాడులు జరిపారు. వారంతా దాదాపుగా రూ.25 కోట్ల వరకు పన్ను ఎగవేసినట్లు అధికారులు నిర్ధరించారు. గురువారం మొత్తం 13 మందిపై దాడులు చేసిన ఐటీ శాఖ.. వారి ఇళ్లు, ఆఫీసుల్లో సోదాలు జరిపింది. కేరళ వ్యాప్తంగా ఈ దాడులు జరిగాయి. భారీ స్థాయిలో పన్ను ఎగవేశారన్న ఆరోపణలతోనే ఈ దాడులు చేసినట్లు ఆదాయ పన్ను శాఖ వెల్లడించింది. ఈ కథనాన్ని పూర్తిగా చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

ABOUT THE AUTHOR

...view details