ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఫిరోజాబాద్ జిల్లాలో తీవ్ర జ్వరంతో(Viral Fever in Uttar Pradesh) 32 మంది పిల్లలు సహా 41మంది మరణించడం కలకలం రేపుతోంది. దీనికి డెంగీనే(Dengue Fever) కారణం కావచ్చని అధికారులు భావిస్తున్నారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణపై ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతోందంటూ పెద్దఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఫిరోజాబాద్ జిల్లా(Firozabad district) ప్రధాన వైద్యాధికారి నీతా కుల్‌శ్రేష్ఠ్‌ను బదిలీ చేయడం చర్చనీయాశం అయింది. ఆమెను అలీగఢ్ మల్ఖాన్ సింగ్ జిల్లా ఆసుపత్రికి సీనియర్ కన్సల్టెంట్‌గా నియమిస్తున్నట్లు ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే బదిలీ ఎందుకు చేశారన్న అంశపై స్పష్టత లేదు.
Viral Fever: వణికిస్తున్న జ్వరాలు.. వారంలో 40 మందికిపైగా మృతి! - యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్
అసలే కరోనా.. ఆపై విష జ్వరాల విజృంభణ. ఇదీ ఉత్తర్‌ప్రదేశ్‌లోని (UP Fever News) ఫిరోజాబాద్ జిల్లా పరిస్థితి. గడచిన వారం రోజుల్లోనే ఈ జిల్లాలో విష జ్వరాలకు 41 మంది బలయ్యారంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. మరణించిన వారిలో 32మంది పిల్లలు సైతం ఉండటం కలచివేస్తోంది.
fever
మరోవైపు ఫిరోజాబాద్‌లో ప్రస్తుత పరిస్థితిపై అధ్యయనం చేసేందుకు దిల్లీ ఐసీఎంఆర్ నుంచి 11 మంది నిపుణుల బృందం చేరుకున్నట్లు అధికారులు తెలిపారు.
ఇవీ చదవండి: