తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పామును కొరికి చంపిన వ్యక్తి- తనను కాటేసిందని... - ఒడిశా వార్తలు టుడే

సాధారణంగా పాము పగబడుతుందని వింటుంటాం. అది కనబడితేనే ఆమడదూరం పారిపోతూ ఉంటాం. మరి అలాంటి విషసర్పాన్ని నోటితో కొరికి చంపడమంటే.. ఊహించాలంటేనే భయం వేస్తుంది కదూ? అయితే ఓ వ్యక్తి మాత్రం దానిని పరపరా కొరికి చంపేశాడు? అతను ఎందుకు అలా చేశాడో మీరూ తెలుసుకొండి..

snake
snake

By

Published : Aug 13, 2021, 3:24 PM IST

పామును కొరికి చంపిన వక్తి

ఓ వ్యక్తి చూడకుండా అడుగు వెయ్యడమే ఆ పాము పాలిట శాపమైంది. తనను కాటేసిందని పామును కొరికి చంపాడు ఒడిశాకు చెందిన ఓ వ్యక్తి.

పామును కొరుకుతున్న కిశోర్ బద్రా
చనిపోయిన పామును చూపిస్తున్న గ్రామస్థులు
కిశోర్ బద్రా

ఇదీ జరిగింది..

జాజ్‌పూర్ జిల్లా దనగాడి తాలూకా గంభారిపాటియా గ్రామానికి చెందిన కిషోర్ బద్రా వ్యవసాయ పనులు ముగించుకుని చీకటిపడిన తర్వాత ఇంటికి వస్తున్నాడు. రాత్రి వేళ దారి కనపడక ఓ పాముపై అడుగు వేశాడు. అది వెంటనే బద్రా కాలిపై కరిచింది. ఇది గమనించిన బద్రా.. దానిపై ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నాడు. కోపంతో పామును చేతుల్లోకి తీసుకొని.. నోటితో కొరికి చంపేశాడు.

చీకట్లో పామును చూపిస్తున్న కిశోర్
పాము కాటువేసిన కాలు ఇదేనని చూపుతున్న వ్యక్తి

దీనిని గమనించిన గ్రామస్థులు బద్రాను ఆస్పత్రికి వెళ్లాల్సిందిగా సూచించారు. కానీ.. అతను మాత్రం నాటు వైద్యుడి వద్దకు వెళ్లి చూపించుకున్నాడు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details