ఉత్తర్‌ప్రదేశ్ గోవర్ధన్ జిల్లాలోని రాధా కుండ్‌కు చెందిన ఓ బాబా.. తాను ఉమ్మిన ప్రసాదాన్ని తన భక్తులకు ఇస్తున్నారు. ఈ విషయం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. అయితే దీనికి స్థానికులు భిన్నంగా స్పందిస్తున్నారు.
శ్రీధామ్ రాధాకుండ్కు చెందిన ప్రాణ్ కృష్ణ దాస్ మహరాజ్.. స్థానికంగా బేలావాలే బాబాగా ప్రసిద్ధి. తన భక్తులకు ఆయన ప్రతిరోజు కిచిడీ ప్రసాదంగా పెడుతుంటారు. అయితే అది మామూలుగా కాదు. అందులో తన ఉమ్మిని జత చేస్తారు.