తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఎండిపోయిన చెరువులో శవాన్ని విడిచిపెట్టిన పోలీస్

గుర్తు తెలియని మృతదేహాన్ని చెరువులో విడిచిపెట్టిన అమానవీయ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ పని చేసింది స్వయంగా ఓ బిహార్​ పోలీసే కావడం విస్మయానికి గురిచేస్తోంది.

policeman dumps dead body in river
శవాన్ని చెరువులో పడేసిన పోలీసు

By

Published : Jun 14, 2021, 11:08 AM IST

చెరువులో శవాన్ని విడిచిపెట్టిన బిహార్ పోలీసు

గంగా నదిలో గుర్తు తెలియని మృతదేహాలు కొట్టుకువస్తోన్న అమానుష ఘటనలు వెలుగుచూస్తోన్న తరుణంలో.. అలాంటి పనిని స్వయంగా పోలీసులే చేయడం నిర్ఘాంతపరుస్తోంది. ఈ ఘటన బిహార్​లోని బాంకా జిల్లాలో జరిగింది. పట్టపగలే చాందన్ చెరువులో గుర్తు తెలియని ఓ శవాన్ని విసిరేశారు బౌన్సీ ఠాణాకు చెందిన ఓ పోలీసు.

ఇలా జరిగింది..

ఓ మినీ వ్యానులో గుర్తు తెలియని మృతదేహాన్ని ఎండిపోయిన చాందన్​ చెరువు వద్దకు తీసుకొచ్చారు బౌన్సీ ఠాణాకు చెందిన పోలీసు. తర్వాత దానిని మరో ఇద్దరు వ్యక్తులు తీసుకెళ్లి చెరువు మధ్యలోని పొదళ్లో విడిచిపెట్టారు. ఈ వ్యవహారంపై ఓ స్థానికుడు ప్రశ్నించగా.. పై అధికారులను అడగాలని బదులిచ్చారు. అక్కడే ఉన్న పోలీసు.. సమాధానం చెప్పకుండా కోపగించి వెళ్లిపోయారు.

డబ్బులు దోచేస్తున్నారు..

నిజానికి గుర్తు తెలియని శవాలకు అంత్యక్రియలు జరిపించాల్సిన బాధ్యత పోలీసులు, ప్రభుత్వ యంత్రాగానిదే. అందుకోసం రోగి కల్యాణ్ సమితి కింద రూ.3 వేల రూపాయలను కూడా ప్రభుత్వం కేటాయిస్తోంది. అయినప్పటికీ అధికారులు డబ్బులు మిగిలించుకొని, ఇలాంటి అమానవీయ ఘటనలకు పాల్పడుతున్నారని స్థానికుడు ఆరోపించారు. దీంతో శవాలను కుక్కలు, ఇతర జంతువులు పీక్కు తింటున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు.

ఇదీ చూడండి:నదిలో మృతదేహాలు- పీక్కు తింటున్న కుక్కలు!

ABOUT THE AUTHOR

...view details