మాజీ ప్రధాని, జేడీఎస్ వ్యవస్థాపకుడు హెచ్డీ దేవెగౌడ మనవడు సూరజ్ రేవన్న.. కర్ణాటక శాసనమండలి ఎన్నికల బరిలో నిలుస్తున్నారు. దేవెగౌడ కుటుంబం నుంచి రాజకీయరంగంలో ప్రవేశిస్తున్న 8వ వ్యక్తిగా నిలిచిచాడు. ఒకవేళ ఈ ఎన్నికల్లో సూరజ్ గెలిస్తే వీరి కుటుంబం అరుదైన ఘనత సాధించనుంది. ఏకకాలంలో లోక్‌సభ, రాజ్యసభ, శాసనసభ, శాసనమండలి ప్రతినిధులుగా సేవలందిస్తున్న ఫ్యామిలీగా అవతరించనుంది(hd deve gowda grandson).
హెజ్డీ దేవెగడ పెద్దకుమారుడు హెడీ రేవన్న వారుసుడే సూరజ్ రేవన్న(deve gowda grandson political entry ). వృత్తిరిత్యా డాక్టర్. జేడీఎస్‌కు కంచుకోట అయిన హాసన్ నుంచి ఎంఎల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఈయన తండ్రి హెచ్డీ రేవన్న కర్ణాటక మాజీ మంత్రి. ప్రస్తుతం హొలెనర్సిపుర నుంచి ఎమ్మేల్యేగా ఉన్నారు. సూరజ్ తల్లి భవాని జిల్లా పరిషత్ సభ్యురాలిగా ఉన్నారు. సూరజ్ సోదరుడు ప్రజ్వల్.. హాసన్ లోక్‌సభ స్థానం నుంచి ఎంపీగా ఉన్నారు.
ఇక జేడీఎస్ అధినేత హెచ్డీ దేవెగౌడ రాజ్యసభ సభ్యునిగా ఉన్నారు. ఆయన చిన్న కుమారుడు హెచ్డీ కుమారస్వామి కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి. చెన్నపట్నం ఎమ్మెల్యే. కుమారస్వామి సతీమణి అనిత కూడా రామనగర ఎమ్మెల్యేగా సేవలందిస్తున్నారు. వీరి కుమారుడు నిఖిల్ జేడీఎస్ యూత్ వింగ్ అధ్యక్షునిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో మండ్య నియోజకవర్గం నుంచి పోటీ చేసి సుమలత అంబరీష్ చేతిలో ఓడిపోయారు(karnataka hd deve gowda grandson ).
ఇప్పుడు ఎమెల్సీగా పోటీ చేస్తున్న సూరజ్ గెలిస్తే హెచ్డీ దేవెగౌడ కుటుంబం నుంచి పార్లమెంటు, అసెంబ్లీకి ఆరుగురు ప్రాతినిధ్యం వహించినట్లవుతుంది. ఫలితంగా అరుదైన రికార్డు సాధించవచ్చు.