తెలంగాణ

telangana

ETV Bharat / bharat

భారీ ఉగ్ర కుట్ర భగ్నం.. 15 కిలోల బాంబులు స్వాధీనం - encounter in Jammu Kashmir

జమ్ముకశ్మీర్​ పుల్వామా జిల్లాలోని ఓ తోట​లో ఉగ్రవాదులు పెట్టిన 15 కిలోల ఐఈడీని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. మరోవైపు.. కుల్గాం జిల్లాలో జరిగిన ఎన్​కౌంటర్​లో ఇద్దరు, అనంతనాగ్​లో ఓ ఉగ్రవాది హతమయ్యారు.

IEDs recovered in Aramula Lasipura
ఉగ్ర కుట్ర భగ్నం

By

Published : Jun 16, 2022, 5:39 PM IST

Updated : Jun 16, 2022, 9:02 PM IST

జమ్ముకశ్మీర్​ పుల్వామా జిల్లాలో భారీ ఉగ్ర కుట్రను భగ్నం చేశారు పోలీసులు, భద్రతా సిబ్బంది. లాసిపోరా ప్రాంతం అర్ముల్లా గ్రామంలోని ఓ తోట​లో ఉగ్రవాదులు పెట్టిన 15 కిలోల ఐఈడీని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఉగ్ర కుట్రకు సంబంధం ఉన్న ఇద్దరిని అరెస్ట్​ చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు కశ్మీర్ ఐజీపీ విజయ్​ కుమార్​ తెలిపారు.

"ఐఈడీని స్వాధీనం చేసుకోవటం ద్వారా భారీ కుట్రను పోలీసులు, భద్రతా బలగాలు భగ్నం చేశాయి. ఆ పేలుడు పదార్థాలు సుమారు 15 కిలోలు ఉంటాయి. పుల్వామా, లిట్టెర్​ ప్రాంతంలోని ఆర్ముల్లా గ్రామంలో ఉగ్రవాదులు వాటిని ఓ తోటలో పెట్టారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టాం. "

- విజయ్​ కుమార్​, ఐజీపీ కశ్మీర్​.

ఎన్​కౌంటర్​లో ముగ్గురు ఉగ్రవాదులు హతం:జమ్ముకశ్మీర్​, కుల్గాం జిల్లాలో గురువారం సాయంత్రం జరిగిన ఎన్​కౌంటర్​లో ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి బలగాలు. మిషిపోరా ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న పక్కా సమాచారంతో మంగళవారం నుంచి నిర్బంధ తనిఖీలు చేపట్టాయి భద్రతా దళాలు. ఈ క్రమంలో గురువారం బలగాలపై ముష్కరులు కాల్పులకు పాల్పడగా.. ఎన్​కౌంటర్​కు దారి తీసింది. ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారని సైనికాధికారులు తెలిపారు. ఆపరేషన్​ కొనసాగుతున్నట్లు తెలిపారు.
మరోవైపు.. అనంత్​నాగ్​ జిల్లాలోని హంగల్​గుండ్​ ప్రాంతంలో ఎన్​కౌంటర్​ జరిగినట్లు చెప్పారు. హిజ్బుల్​ ముజాహిద్దీన్​కు చెందిన ఇద్దరు ఉగ్రవాదులను బలగాలు చుట్టుముట్టాయని తెలిపారు. భద్రతా దళాల కాల్పుల్లో ఓ ఉగ్రవాది హతమైనట్లు వెల్లడించారు.

ఇదీ చూడండి:'అగ్నిపథ్'​పై ఉద్యోగార్థులు భగ్గు.. రెండు రైళ్లకు నిప్పు.. ఉపసంహరణకు డిమాండ్

''అగ్నిపథ్​'తో వారికి ఎలాంటి నష్టం లేదు'.. కేంద్రం క్లారిటీ

Last Updated : Jun 16, 2022, 9:02 PM IST

ABOUT THE AUTHOR

...view details