మహారాష్ట్రలో దారుణ ఘటన జరిగింది. ఠాణెలో ఓ టిఫిన్ సెంటర్ యజమానితో రూ.20 కోసం వాగ్వాదానికి దిగిన ముగ్గురు వ్యక్తులు.. అందరూ చూస్తుండగానే అతడిపై దాడి చేసి చంపేశారు.
ఏం జరిగిందంటే.?
ఠాణె జిల్లాలోని మీరా రోడ్ సమీపంలో వీరేంద్ర యాదవ్(26) ఇడ్లీ సెంటర్ నిర్వహిస్తున్నాడు. శుక్రవారం ఉదయం ఆ హోటల్‌కు ముగ్గురు వ్యక్తులు వచ్చారు. తమకు బాకీ ఉన్న రూ.20 ఇవ్వాలని వీరేంద్రతో వాగ్వాదానికి దిగారు. ఆ గొడవ కాస్తా పెద్దదైంది. ఆ ముగ్గురూ వీరేంద్రను తోసేశారు. కిందపడిన అతడి తలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆ దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు.