IBPS Calendar 2024 : ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) 2024 సంవత్సరంలో నిర్వహించనున్న వివిధ పరీక్షల (Tentative Calendar) క్యాలెండర్ను విడుదల చేసింది. ముఖ్యంగా క్లర్క్, ప్రొబేషనరీ ఆఫీసర్, స్పెషలిస్ట్ ఆఫీసర్ పరీక్షల తేదీలను ఐబీపీఎస్ ప్రకటించింది. వీటితోపాటు రీజనల్ రూరల్ బ్యాంక్ (RRB)లకు సంబంధించిన ఆఫీస్ అసిస్టెంట్, ఆఫీసర్ పరీక్షల తేదీలను కూడా ప్రకటించింది. వాటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
IBPS RRB Exam Dates :ఐబీపీఎస్ ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల్లోని ఆఫీస్ అసిస్టెంట్, ఆఫీసర్ (స్కేల్-1) పోస్టుల భర్తీ కోసం షెడ్యూల్ ఖరారు చేసింది. వీటి పరీక్ష తేదీలు ఎప్పుడంటే?
- ప్రిలిమినరీ పరీక్ష తేదీలు : 2024 ఆగస్టు 3, 4, 10, 17, 18
- సింగిల్ ఎగ్జామ్ తేదీ : 2024 సెప్టెంబర్ 29
- మెయిన్ ఎగ్జామ్ తేదీ :
ఆఫీసర్ స్కేల్ 1 | 2024 సెప్టెంబర్ 29 |
ఆఫీస్ అసిస్టెంట్ | 2024 అక్టోబర్ 6 |
IBPS Clerk And PO Exam Dates :పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లోని క్లర్క్, పీవో, స్పెషలిస్ట్ ఆఫీసర్ పరీక్షల తేదీలను కూడా ఐబీపీఎస్ విడుదల చేసింది. వాటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
క్లర్క్ పరీక్ష తేదీలు
- ప్రిలిమినరీ పరీక్ష తేదీలు : 2024 ఆగస్టు 24, 25, 31
- మెయిన్ ఎగ్జామినేషన్ తేదీ : 2024 అక్టోబర్ 13
ప్రొబేషనరీ ఆఫీసర్ (PO) పరీక్ష తేదీలు
- ప్రిలిమినరీ పరీక్ష తేదీలు : 2024 అక్టోబర్ 19
- మెయిన్ ఎగ్జామినేషన్ తేదీ : 2024 అక్టోబర్ 20
స్పెషలిస్ట్ ఆఫీసర్ (SO) పరీక్ష తేదీలు
- ప్రిలిమినరీ పరీక్ష తేదీలు : 2024 నవంబర్ 9
- మెయిన్ ఎగ్జామినేషన్ తేదీ : 2024 డిసెంబర్ 14