IAF officer arrest: భారత వైమానిక దళానికి చెందిన అధికారి దేవేంద్ర శర్మను దిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు అరెస్టు చేశారు. పాకిస్థాన్‌కు చెందిన మహిళ హనీ ట్రాప్‌లో చిక్కుకుని దేశ భద్రతకు సంబంధించిన ముఖ్యమైన సమాచారాన్ని లీక్ చేసినట్లు శర్మపై ఆరోపణలు ఉన్నాయి. పాక్ మహిళ.. సామాజిక మాధ్యమాల ద్వారా దేవేంద్ర శర్మను ట్రాప్ చేసినట్లు గుర్తించారు పోలీసులు. అతను దిల్లీ ఎయిర్‌ఫోర్స్‌లో ఎయిర్‌మెన్‌గా పనిచేస్తున్నట్లు వెల్లడించారు.
వలపు వలలో చిక్కి దేశ సమాచారం లీక్.. వాయుసేన అధికారి అరెస్ట్! - హానీ ట్రాప్
పాకిస్థాన్ మహిళ హనీట్రాప్‌లో చిక్కుకుని దేశ భద్రతకు సంబంధించిన కీలక సమాచారాన్ని లీక్ చేసిన ఐఏఎఫ్ అధికారిని పోలీసులు అరెస్టు చేశారు. అతడ్ని తక్షణమే సర్వీస్ నుంచి తొలగించినట్లు వెల్లడించారు.
Honey Trapped IAS Officer: మిలిటరీ ఇంటెలిజెన్స్, దిల్లీ క్రైమ్ బ్రాంచ్ సంయుక్త ఆపరేషన్ నిర్వహించి దేవేంద్ర శర్మను అదుపులోకి తీసుకుంది. అతని ద్వారా సమాచారం బయటకు వెళ్తున్నట్లు నిర్ధరించుకున్న తర్వాతే ఈ చర్యలకు ఉపక్రమించారు. మే 6న కస్టడీలోకి తీసుకోగా.. గురువారం (మే 12) విచారణ ప్రారంభించారు. ఆధారాలు, సాక్ష్యాలు ఇచ్చిన సమాచారం ప్రకారమే దేవేంద్ర శర్మను అరెస్టు చేశామని అధికారులు తెలిపారు. అతన్ని సర్వీస్ నుంచి తొలగించినట్లు వెల్లడించారు.
ఇదీ చదవండి:స్నేహితుడిని కలిసేందుకు దుబాయ్ వెళ్లి.. ఎమ్మెల్యే హఠాన్మరణం