భారత వాయుసేనకు చెందిన ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్ నుంచి సుదీర్ఘ లక్ష్యంలో విసిరిన బాంబు(లాంగ్ రేంజ్ బాంబ్) ప్రయోగం విజయవంతమైందని రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీఓ) తెలిపింది. దేశీయంగా అభివృద్ధి చేసిన ఈ బాంబును ఐఏఎఫ్ విమానం నుంచి జారవిడవగా నిర్దేశిత లక్ష్యాన్ని చేరుకుందని వెల్లడించింది.
డీఆర్డీఓ ఘనత- 'లాంగ్రేంజ్ బాంబ్' ప్రయోగం సక్సెస్
సుదీర్ఘ లక్ష్యాలను ఛేదించగల, దేశీయంగా అభివృద్ధి చేసిన బాంబును(లాంగ్ రేంజ్ బాంబ్) భారత వాయుసేన విజయవంతంగా పరీక్షించింది. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్, భారత వైమానిక దళం సంయుక్తంగా దీనిని అభివృద్ధి చేయడం విశేషం.
బాంబ్
'భూమిపై నిర్దేశించిన లక్ష్యాన్ని కచ్చితత్వంతో లాంగ్ రేంజ్ బాంబ్ పూర్తి చేసింది. తద్వారా మిషన్ లక్ష్యాలు విజయవంతమయ్యాయి' అని రక్షణశాఖ వర్గాలు తెలిపాయి. డీఆర్డీఓ, ఐఏఎఫ్ ఈ బాంబును సంయుక్తంగా అభివృద్ధి చేశాయి.
ఇవీ చదవండి: