తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Hyderabad Rains : 30 నిమిషాల్లో 3.65 సెంటీ మీటర్ల వర్షం.. ఆగమైన భాగ్యనగరం - హైదరాబాద్‌ న్యూస్

Hyderabad Rains : ఒక్క వర్షం హైదరాబాద్‌ను వరదలో ముంచెత్తింది. కురిసింది రెండు గంటలే అయినా ప్రజల్ని నానా ఇబ్బందులు పెట్టింది. హైదరబాదాద్‌లో సోమవారం సాయంత్రం కురిసిన వర్షానికి నగరమంతా జలమయం అయ్యింది. రోడ్లపై నీరు చేరడంతో వాహనదారులు తెగ ఇబ్బందులు పడ్డారు. విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. అరగంట పాటు దంచికొట్టిన వానతో నగరం అస్తవ్యస్తమైంది.

Rains
Rains

By

Published : Jul 25, 2023, 7:59 AM IST

ఎడతెరిపి లేని వర్షాలకు.. ఆగమైన భాగ్యనగరవాసులు

Heavy Rainfall in Hyderabad : భారీ వర్షానికిహైదరాబాద్‌ మహానగరం తడిసిముద్దైంది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు చోట్ల భవనాలు కుంగిపోయాయి. ఉరుములు, మెరుపులతో కూడిన భారీశబ్దంతో పడ్డ పిడుగులతో భాగ్యనగర వాసులు బెంబేలెత్తిపోయారు. ఒక్కసారిగా కురిసిన వర్షానికి తీవ్ర అవస్థలుపడ్డారు. ఎడతెరపి లేకుండా వానలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచించారు. సోమవారం సాయంత్రం 5.30 గంటలకు కుండపోతగా కురవడం మొదలైంది. ఆరు గంటల సమయానికి మియాపూర్‌లో 3.65 సెం.మీ. వర్షపాతం నమోదైంది.

Hyderabad Rains : వాయువ్య బంగాళాఖాతంలో ఉన్న ఆవర్తనము ప్రభావం వల్ల రాష్ట్రవ్యాప్తంగా వర్షం దంచికొట్టంది. వరుణ ప్రతాపంతో రాష్ట్ర రాజధాని అతలాకుతలమైంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి శేరిలింగంపల్లి నియోజకవర్గం నల్లగండ్లలో బహుళ అంతస్తుల నిర్మాణ సంస్థ సెల్లార్ రిటర్న్ంగ్ వాల్ కులిపోయింది. దీంతో సెల్లార్‌కు అనుకోని ఉన్న అపార్ట్‌మెంట్స్ ప్రహరీ గోడలు కుంగిపోయాయి. లంగర్ హౌస్‌లోని గొల్లబస్తీ ప్రాంతంలో ఉన్న ఓ మజీద్ పై పిడుగు పడడంతో గోపుర కలశం ఊడి కింద పడిపోయింది. రాజేంద్రనగర్ అత్తాపూర్‌లో నాలుగో అంతస్తు పై పిడుగు పడటంతో స్థానిక ప్రజలందరూ భయభ్రాంతులకు గురయ్యారు. అపార్ట్‌మెంట్‌లోని టీవీలు ఫ్రిజ్‌లు కాలిపోయాయని తెలిపారు. అబిడ్స్‌లో ఓ వ్యక్తి పై 4వ అంతస్తు నుంచి రేకులు పడడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.

Heavy Rain in Hyderabad :ఒక్కసారిగా విరుచుకుపడిన వానతో.. రోడ్లు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లో.. వరదముంచెత్తింది. కోఠి, సుల్తాన్ బజార్, బేగంబజార్, అబిడ్స్, నాంపల్లి, బషీర్ బాగ్, నారాయణగూడ, హిమాయత్ నగర్, లిబర్టీ, లకడికపుల్‌లలో కురిసిన భారీ వర్షంతో.. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఎల్బీనగర్, మన్సురాబాద్, నాగోల్, వస్థలిపురం,, బి.ఎన్.రెడ్డి నగర్, హయత్ నగర్, భాగ్యలత, పెద్ద అంబర్‌పేట్, అబ్దుల్లాపూర్‌మెట్ ప్రాంతాలలో ఉరుములు మెరుపులతో భారీగా వర్షం కురవడంతో లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. మోకాళ్ళ లోతు నీళ్లు వచ్చాయి. బోరబండ, ఎర్రగడ్డ , సనత్ నగర్, యూసఫ్ గూడ, అమీర్పేట్, ఎస్సార్ నగర్, మైత్రివనం, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌లో కురిసిన వర్షానికి ప్రజలు నానా అవస్థలు పడ్డారు. మూసారాంబాగ్ వంతెనపై భారీగా వర్షం నీరు నిలవడంతో అంబర్‌పేట్ నుంచి దిల్‌సుఖ్ నగర్‌కు వెళ్లే వాహనదారులు ఇక్కట్లు ఎదుర్కొన్నారు..

రాష్ట్ర రాజధానిలో కురిసిన భారీ వర్షం నేపథ్యంలో విద్యుత్ సరఫరా పరిస్థితిని టీఎస్‌ఎస్‌పీడీసీఎల్‌ సీఎండీ రఘుమా రెడ్డి సమీక్షించారు. సూపరింటెండింగ్ ఇంజినీర్లు, చీఫ్ జనరల్ మేనేజర్లతో ఆడియో కాన్ఫరెన్స్ ద్వారా చర్చించారు. రాబోవు రుతుపవనాల దృష్ట్యా జోన్ వ్యాప్తంగా తీసుకోవలసిన జాగ్రత్తలపై డీఆర్‌ఎమ్‌లతో దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ సమీక్ష నిర్వహించారు.

ఇవీ చదవండ:

ABOUT THE AUTHOR

...view details