తెలంగాణ

telangana

ETV Bharat / bharat

బాలుడిపై పైశాచికం.. ఫ్యాన్​కు వేలాడదీసి.. పూరీ కర్రతో చితకబాది... - హైదరాబాద్ చైల్డ్ అబ్యూస్

Hyderabad Child abuse: అమాయక బాలుడిని చిత్రహింసలు పెట్టాడు ఓ వ్యక్తి. ఫ్యాన్​కు తలకిందులుగా వేలాడదీసి.. పూరీ కర్రతో ఇష్టమొచ్చినట్టు కొట్టాడు. నిందితుడు బంగాల్​కు చెందిన వ్యక్తి కాగా.. హైదరాబాద్​లో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది.

Child abuse video from Hyderabad
Child abuse video from Hyderabad

By

Published : Apr 2, 2022, 11:09 AM IST

Updated : Apr 2, 2022, 11:24 AM IST

బాలుడిపై పైశాచికం

Hyderabad Child abuse: చిన్నారిపై ఓ వ్యక్తి క్రూరంగా ప్రవర్తించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. యువకుడు ఓ బాలుడిని చిత్ర హింసలు పెట్టడం వీడియోలో కనిపిస్తోంది. ఓ వ్యక్తి బాలుడిని హింసిస్తుంటే మరొకరు వీడియో రికార్డు చేసినట్లు తెలుస్తోంది. దృశ్యాల్లో కనిపిస్తున్న వ్యక్తి.. బాలుడిని తలకిందులుగా వేలాడదీసి పూరీ కర్రతో కొట్టాడు. కిందపడేసి ఛాతిపై కాలితో తొక్కాడు. మెడకు బరువులు తగిలించి గుంజీలు తీయించాడు.

Bengal man Child abuse: యువకులు ఇద్దరూ అసభ్య పదజాలం ఉపయోగిస్తూ బాలుడిని దూషించారు. హైదరాబాద్​లోనే ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. అయితే, ఈ ఘటన తాలూకు దృశ్యాలు బంగాల్​లో వైరల్​ అయ్యాయి. వీడియోలో కనిపిస్తున్న వ్యక్తి బంగాల్​లోని బమన్​గోలా పోలీస్ స్టేషన్ పరిధిలో నివసించేవాడని తెలుస్తోంది. అతడి పేరు ప్రొసెన్​జిత్ మండల్ అని అక్కడి స్థానికులు చెబుతున్నారు. అతడి స్వస్థలం నందినదాహ గ్రామమని వెల్లడించారు.

ఆ గ్రామంలోని అతడి ఇంట్లో ఇప్పుడు ఎవరూ ఉండటం లేదని తెలిపారు. ప్రొసెన్​జిత్ సోదరులు విదేశాల్లో పనిచేసుకుంటున్నారని వెల్లడించారు. ప్రొసెన్​జిత్ ప్రస్తుతం తెలంగాణలోని హైదరాబాద్​లో ఉంటున్నాడని స్థానికులు చెప్పారు. అయితే, వీడియోలో ఆ వ్యక్తి చిత్ర హింసలు పెడుతున్న బాలుడిని ఎవరూ గుర్తించలేదు. అతడు ఎవరో తెలియదని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి:బాలికపై సామూహిక అత్యాచారం.. మనస్తాపంతో ఉరి వేసుకుని ఆత్మహత్య

Last Updated : Apr 2, 2022, 11:24 AM IST

ABOUT THE AUTHOR

...view details