ETV Bharat Telangana

తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పెళ్లైన 25రోజులకే భార్య హత్య.. మృతదేహాన్ని సంచిలో కుక్కి అడవిలో.. - బార్యను చంపిన భర్త

అదనపు కట్నం కోసం భార్యను హతమార్చాడు భర్త. చేసుకున్న 25 రోజులకే ఆమె ఆయువు తీశాడు. గొంతుకోసి సంచిలో చుట్టి అడవిలో పడేశాడు. మరోవైపు, అక్కా చెల్లెల్లను కిడ్నాప్​ చేసి అత్యాచారానికి పాల్పడ్డ నేరస్థుడిని పోలీసులు పట్టుకున్నారు.

man murdered wife for dowry
కట్నం కోసం భార్యను హతమార్చిన భర్త
author img

By

Published : Nov 24, 2022, 12:51 PM IST

పెళ్లైన 25 రోజులకే భార్యను కడతేర్చాడు ఓ కసాయి భర్త. వివాహం తరువాత భార్యను అనేక వేధింపులకు గురి చేసిన అతడు.. అదనపు కట్నం కోసం ఆమెను అంతమొందించాడు. కత్తితో గొంతుకోసి చంపాడు. మృతదేహాన్ని సంచిలో కుక్కి అడవిలో పడేశాడు. పోలీసుల కథనం ప్రకారం... రాజస్థాన్ అజ్మీరా జిల్లా క్రిష్టియన్ గంజ్​లోని ద్వారకాకు చెందిన ముకేశ్ సింధీకి అక్టోబర్​ 29న జెన్నిఫర్​ అనే మహిళతో వివాహం జరిగింది.

in article image
ముకేశ్, జెన్నిఫర్

అప్పటి నుంచే ముకేశ్.. జెన్నిఫర్​ను అదనపు కట్నం కోసం వేధించేవాడు. ఈ క్రమంలోనే బుధవారం.. ముకేశ్​ తన భార్యను హత్య చేసి పుష్కర్ అడవిలో పడేశాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు పేర్కొన్నారు.

కాగా, బుధవారం తమకు ముకేశ్ ఇంటి నుంచి అరుపులు వినిపించాయన్నారు కాలనీవాసులు. అది జెన్నిఫర్​ గొంతెనన్నారు. కొద్దిసేపటి తరువాత గోనె సంచిలో ఆమెను చుట్టేసి స్కూటీపై పెట్టుకొని బయటకు వెళ్లాడని వివరించారు. సంచిలో వెంట్రుకలు, శరీరం బయటకు కనిపించాయని, అనుమానంతో స్థానిక కౌన్సిలర్​కు, కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చినట్లు స్థానికులు తెలిపారు.

అక్కా చెల్లెలపై రేప్!
ఓ బాలిక, ఆమె అక్కను కిడ్నాప్ చేసి తీసుకెళ్తుండగా ఓ నేరస్థుడిని రాజస్థాన్​ జోధ్​పుర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఉత్తరాఖండ్​ కాశీపురకు చెందిన నేరస్థుడు హితేంద్ర పాల్​ గడారియాను భోపాల్​లో పట్టుకున్నారు.

అనేక కేసుల్లో ఇతడు నిందితుడిగా ఉన్నాడు. చాలా కాలంగా తప్పించుకొని తిరుగుతున్నాడు. దీంతో తీవ్రంగా అతని కోసం గాలించిన పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. నవంబర్​ 16న ఆ ఇద్దరు అక్క చెల్లెలను కిడ్నాప్​ చేశాడని, పోలీసులు తెలిపారు. నిందితుడు వారిపై అత్యాచారం చేసినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. కాగా, హితేంద్ర పాల్​ 17 కేసుల్లో నిందితుడిగా ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. అందులో 4 హత్య కేసులు ఉన్నట్లు వారు తెలిపారు.

రోగి మృతికి నిరసనగా ఆందోళన
మధ్యప్రదేశ్ ​రేవా జిల్లాలోని సంజయ్​గాంధీ ఆసుపత్రిలో రోగి మృతికి నిరసనగా.. బంధువులు ఆందోళనకు దిగారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే రోగి చనిపోయినట్లు వారు చెబుతున్నారు. రోగి ఉన్న ఐసీయూ వార్డులో నాలుగు గంటలు కరెంటు నిలిచిపోయినట్లుగా వారు ఆరోపించారు. మరో 20 మంది రోగులు ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్లు పేర్కొన్నారు.

అయితే, ఈ ఆరోపణలను ఆసుపత్రి యాజమాన్యం కొట్టిపారేసింది. 'సిద్ధి జిల్లాకు చెందిన స్తుతి మిశ్రా భార్య.. శ్వాస సంబంధిత ఇబ్బందులతో ఆసుపత్రిలో చేరింది. అనంతరం ఆమె పరిస్థితి విషమంగా మారింది. చికిత్స పొందుతూ మృతి చెందింది' అని వైద్యుల తెలిపారు. రోగి మృతిలో తమ నిర్లక్ష్యం ఏమి లేదని వారు చెబుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details