తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఆఫీసులో బాస్ నమ్మకం ఎలా సాధించాలి?

How to Win Confidence of Your Boss : ఆఫీసులో బాస్​తో మీకు మంచి రిలేషన్​షిప్ లేదా..? కస్సుబుస్సు అంటూ కోపగించుకుంటున్నారా? అయితే ఇది మీకోసమే. ఈ 5 టిప్స్ ఫాలో అయ్యారంటే కచ్చితంగా బాస్ విశ్వాసాన్ని పొందుతారు. మీ కేరీర్​లోనూ ముందుకు దూసుకెళ్తారు. అవేంటో ఇప్పుడు చూద్దాం..

How to Get Confidence of Your Boss
How to Get Confidence of Your Boss

By ETV Bharat Telugu Team

Published : Dec 31, 2023, 11:15 AM IST

How to Win Confidence of Your Boss :మీరు పనిచేసే ఆఫీస్​లో(Office)యజమానితో రిలేషన్​షిప్​ మంచిగా ఉండాలి. లేకపోతే పలు సమస్యలు ఎదుర్కొవాల్సి ఉంటుంది. ఈ పరిస్థితి మీ వృత్తిపరమైన జీవితానికే కాకుండా.. మానసిక ఆరోగ్యానికీ మంచిది కాదు. మరి.. మీరు మీ బాస్​తో మంచి రిలేషన్​షిప్ మెయింటెన్ చేస్తూ వారి విశ్వాసాన్ని పొందాలంటే ఏం చేయాలి? అన్నది ఈ స్టోరీలో తెలుసుకుందాం.

వర్క్ రిజల్ట్స్ :మీ యజమాని విశ్వాసాన్ని గెలుచుకోవాలంటే మీరు చేయాల్సిన మొదటి పని.. మీ వర్క్​లో మెరుగైన రిజల్ట్స్ చూపించడం. పనిలో చురుగ్గా ఉంటూ బాస్ మీకు అప్పగించిన టార్గెట్స్​ను సక్సెస్ ఫుల్​గా కంప్లీట్ చేస్తుండాలి. ప్రాజెక్టులు, టాస్క్​లు వంటివి సమర్థవంతంగా ఎదుర్కోవడానికి సిద్ధం ఉండాలి. రెస్పాన్సిబిలిటీ తీసుకోవడానికి ముందుకు రావాలి. బాధ్యత నుంచి పారిపోవద్దు. అప్పుడు క్రమంగా మీపై వారికి నమ్మకం పెరుగుతుంది.

కమ్యూనికేషన్ :మీ బాస్​తో మంచి రిలేషన్ కొనసాగించాలంటే చక్కటి కమ్యూనికేషన్ అనేది చాలా అవసరం. యజమాని విశ్వాసాన్ని చూరగొనడంలో ఇది కీలకమని చెప్పుకోవచ్చు. అందుకోసం ఎప్పటికప్పుడూ మీ పురోగతి, సవాళ్లు, విజయాల గురించి వారితో పంచుకోవాలి. అలాగే క్రమం తప్పకుండా.. మెయిల్స్, ప్రోగ్రెస్ రిపోర్టుల ద్వారా అప్డేట్స్ అందించాలి. విషయాన్ని సూటిగా, స్పష్టంగా చెప్పాలి.

నేర్చుకునే లక్షణం :మీ బాస్ నమ్మకాన్ని పొందాలంటే మీలో ఉండాల్సిన మరో ముఖ్యమైన లక్షణం.. నేర్చుకునే లక్షణం. విభిన్న పనులు, సవాళ్లను మేనేజ్ చేయగలరనే నమ్మకం మీ యజమానికి కలగాలి. ఇందుకోసం.. మీరు ఎప్పటికప్పుడు కొత్త సామర్థ్యాలను పెంచుకునేందుకు ప్రయత్నించాలి. కొత్త విషయాలు నేర్చుకునేందుకు ఆసక్తి చూపించాలి. మీ కంఫర్ట్ జోన్ దాటి.. కొత్త బాధ్యతలను స్వీకరించేందుకు సిద్ధంగా ఉండాలి. ఇలా పాజిటివ్ యాటిట్యూడ్​ కలిగి ఉన్నప్పుడు మీ బాస్ మిమ్మల్ని టీమ్​లో బలమైన మెంబర్​గా చూస్తారు.

టీమ్ వర్క్ :ఆఫీసుల్లో టీమ్ వర్క్ చాలా ముఖ్యం. ఏదైనా ఇంప్రూవ్​ మెంట్ సాధించాలంటే టీమ్ వర్క్ ద్వారానే సాధ్యం. కాబట్టి.. మీ సహోద్యోగులతో మాట్లాడేటప్పుడు సానుకూలంగా ఉంటూ.. వారికి సపోర్ట్ చేయండి. మీ టాలెంట్​ను వారితో షేర్​ చేసుకోండి. కలిసి ప్రాజెక్ట్ వర్క్ చేస్తున్నప్పుడు తోటి ఉద్యోగులకు సహకరించండి. మొత్తంగా టీమ్ టార్గెట్ సాధించడంలో మీదైన కృషిని చూపండి.

నిజాయితీగా : బాస్​తోపాటు తోటి ఉద్యోగుల నమ్మకాన్ని సాధించాలంటే.. నిజాయితీగా ఉండడం చాలా ముఖ్యం. పనిలో కూడా దాన్ని చూపించండి. అప్పుడు అందరూ మిమ్మల్ని ఇష్టపడతారు. మీతో అన్ని విషయాలనూ షేర్ చేసుకునేందుకు చూస్తారు.

ఇలాంటి లక్షణాలను మీరు అలవర్చుకున్నప్పుడు.. మీకు తెలియకుండానే మీలో లీడర్ షిప్ క్వాలిటీస్ డెవలప్ అవుతాయి. ఇదే విధంగా ముందుకు సాగుతున్నకొద్దీ బలపడతాయి. అప్పుడు తప్పకుండా మీ బాస్ తోపాటు యాజమాన్యం మిమ్మల్ని గుర్తిస్తుంది.

కొలువు కావాలంటే.. ఇవి ఉండాల్సిందే..!

మీ జీతం పెరిగిందా?.. ఖర్చులను తగ్గించి ఇన్వెస్ట్​ చేసుకోండిలా!

ABOUT THE AUTHOR

...view details