తెలంగాణ

telangana

ETV Bharat / bharat

How to Check TS ePASS Scholarship Status : మీ స్కాలర్​షిప్ స్టేటస్ ఇలా చెక్​ చేసుకోండి..! - ఈ పాస్ స్కాలర్​షిప్ రిజిస్ట్రేషన్ నంబరు పొందడమెలా

How to Apply TS ePASS Scholarship Procedure : మీరు TS ePASS స్కాలర్​షిప్ కోసం అప్లై చేశారా? ఎలా స్టేటస్ చెక్​చేసుకోవాలో తెలియట్లేదా..? నో ప్రాబ్లం. మీ అప్లికేషన్ నంబర్ మర్చిపోయినా సరే.. స్కాలర్​షిప్ స్టేటస్​ను ఆన్​లైన్​లో సింపుల్​గా తెలుసుకోవచ్చు.

How to Apply for TS ePASS Scholarship
How to Check TS ePASS Scholarship Status

By

Published : Aug 21, 2023, 10:11 AM IST

How to Apply TS ePASS Scholarship Procedure :తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యను ప్రోత్సహించడానికి తెలంగాణ స్టేట్ ఎలక్ట్రానిక్ పేమెంట్ అండ్ అప్లికేషన్ సిస్టమ్ ఆఫ్ స్కాలర్‌షిప్స్(TS ePASS) కార్యక్రమాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. వివిధ రకాల ఫీజులతో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న రిజర్వ్​డ్ కోటాకు చెందిన విద్యార్థులకు.. ఆర్థిక సహాయం అందించడం ఈ కార్యక్రమం ప్రాథమిక ఉద్దేశం. TS ePASS(టీఎస్ ఈ-పాస్) అనే ఆన్​లైన్​ సిస్టమ్​లో ప్రతి సంవత్సరం విద్యార్థులు స్కాలర్​షిప్​ల కోసం దరఖాస్తు చేసుకుంటారు. అనంతరం వారి దరఖాస్తులను స్వీకరించి ఆయా విద్యాసంవత్సరానికి సంబంధించిన స్కాలర్​షిప్ నిధులను మంజూరు చేస్తోంది.

TS ePASS Scholarship Apply Procedure :అలాగే UPSC సివిల్ సర్వీసెస్ పరీక్షలు, రాష్ట్ర ప్రభుత్వ పోటీ పరీక్షలు, ఇతర పోటీ పరీక్షల కోసం ఉచిత కోచింగ్ ప్రోగ్రామ్స్ కోసం అప్లికేషన్స్ స్వీకరిస్తోంది. మీరు వాటి కోసం నమోదు చేసుకోవడానికి http://tsstudycircle.co.in వెబ్​సైట్​లోకి లాగిన్ అవ్వాలి. ఇక్కడ మనం.. TS ePASS స్కాలర్​షిప్ పొందాలంటే ఏయే ఏయే అర్హతలుండాలి? ఏ విధంగా అప్లై చేసుకోవాలి? స్కాలర్​షిప్ స్టేటస్ ఎలా చెక్​ చేసుకోవాలి ? వంటి వివరాలను చూద్దాం..

TS ePASS Scholarship Eligibility Criteria :

టీఎస్ ఈపాస్ స్కాలర్‌షిప్ పొందేందుకు అర్హత ప్రమాణాలివీ..

  • కుటుంబ వార్షికాదాయం 2లక్షల రూపాయలు, అంతకన్నా లోపు ఉన్న ఎస్సీ, ఎస్టీ సంక్షేమ విద్యార్థులు
  • కుటుంబ వార్షికాదాయం 1.5 లక్షల రూపాయలు, అంతకంటే తక్కువగా ఉన్న గ్రామీణ ప్రాంత బీసీ, ఈబీసీ, మైనారిటీ విద్యార్థులు
  • కుటుంబ వార్షికాదాయం 2 లక్షల రూపాయలు, అంతకన్నా తక్కువ ఉన్న పట్టణ ప్రాంత బీసీ, ఈబీసీ, మైనారిటీ విద్యార్థులు
  • కుటుంబ వార్షికాదాయం 1 లక్ష రూపాయల కంటే తక్కువ లేదా సమానంగా ఉన్న దివ్యాంగ విద్యార్థులు
  • ఈబీసీ విద్యార్థులు కార్పొరేట్ కాలేజీ అడ్మిషన్ల పథకం కింద ఎంపికైతే.. వారు ఇంటర్మీడియట్ కోర్సులకు అర్హులు
  • ప్రతీ త్రైమాసికం చివరిలో 75 శాతం కంటే ఎక్కువ హాజరు పొందిన విద్యార్థులు.. అలాగే తదుపరి విద్యా సంవత్సరానికి అర్హత పొందిన వారు ఈ స్కాలర్‌షిప్ రెన్యూవల్​ కు అర్హులు

How to Apply TS ePASS Scholarship :

టీఎస్ ఈపాస్ స్కాలర్‌షిప్ దరఖాస్తు విధానమిదే..

  • మొదట తెలంగాణ ఈపాస్ అధికారిక వెబ్‌సైట్​ని సందర్శించాలి
  • అనంతరం విద్యార్హత ప్రకారం మీ స్కాలర్​షిప్ రకాన్ని ఎంచుకోవాలి
  • ఆ తర్వాత 'Fresh Registration' ఆప్షన్​పై క్లిక్ చేయాలి
  • అప్పుడు మీ బ్రౌజర్​లో అప్లికేషన్ ఫారమ్ ఓపెన్ అవుతుంది
  • అక్కడ అడిగిన పూర్తి వివరాలను నమోదు చేసి, అవసరమైన పత్రాలను అప్​లోడ్ చేయాలి
  • చివరగా.. అప్లికేషన్​లో నమోదు చేసిన వివరాలను సమీక్షించుకుని "Submit" చేయాలి
  • అనంతరం అప్లికేషన్ ప్రింట్ అవుట్ తీసుకొని, భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్​ రిఫరెన్స్ నంబర్​ను నోట్ చేసుకోవాలి
  • నోట్​ : మీరు స్కాలర్​షిప్​ను రిన్యూవల్ చేసుకోవాలంటే కూడా పైన పేర్కొన్న విధంగానే అప్లికేషన్ చేసుకోవాలి.

విద్యార్థులకు శుభవార్త.. ఉపకార వేతనాలకు కుటుంబ వార్షికాదాయం పెంపు

How to Check TS ePASS Scholarship Status :

టీఎస్ ఈపాస్ స్టేటస్ చెక్​ చేసుకోవడమెలా..?

  • మొదట తెలంగాణ ఈపాస్ అధికారిక వైబ్​సైట్​కి వెళ్లాలి
  • అనంతరం అక్కడ మీకు సంబంధించిన స్కాలర్​షిప్ పేజీకి వెళ్లి 'Know Your Application Status' పై క్లిక్ చేయాలి
  • మీ అప్లికేషన్ వివరాలు టైప్ చేసి.. 'Get Status' పై క్లిక్ చేయాలి
  • చివరగా మీకు కావాల్సిన TS ePASS స్కాలర్​షిప్ స్టేటస్​ స్క్రీన్​పై డిస్​ప్లే అవుతుంది

Reasons for Rejecting TS ePASS Status :

మీ స్కాలర్​షిప్ అప్లికేషన్​ రిజక్ట్ అవ్వొచ్చు.. కారణాలివే..

  • తప్పుడు ఆదాయ, కుల సమాచారాన్ని అందించడం
  • సంవత్సరం అధ్యయనం లేదా కోర్సు సమాచారాన్ని తప్పుగా అందించడం
  • అప్లికెంట్ బోనఫైడ్ విద్యార్థి కాకపోవడం
  • కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాన్ని సరిగ్గా అప్​లోడ్ చేయకపోవడం
  • మేనేజ్​మెంట్ కోటా కింద దరఖాస్తుదారుడు ప్రవేశం పొందడం
  • దరఖాస్తుదారుని పునరుద్ధరణ.. ప్రతిపాదనకు అందకపోవడం
  • ఫీల్డ్ ఆఫీసర్ ఇచ్చిన సిఫార్సు లేకపోవడం.. అదే కోర్సు స్థాయికి దరఖాస్తుదారుడు స్కాలర్‌షిప్‌ను క్లెయిమ్ చేయడం
  • కళాశాల నుంచి విద్యార్థి డిటెయిన్డ్ కావడం

అప్లికేషన్ నంబర్ మరిచిపోతే ఎలా..?

How to get Forget TS ePASS Scholarship Number :

  • మీ స్కాలర్ షిప్ స్టేటస్ తెలుసుకోవాలంటే కచ్చితంగా దరఖాస్తు సమయంలో మీకు వచ్చిన అప్లికేషన్ రిఫరెన్స్ నంబరు అవసరం. ఒకవేళ ఆ నంబరు మర్చిపోతే ఎలా కనుగోనాలో చూద్దాం...
  • మొదట టీఎస్ ఈపాస్ అధికారిక వైబ్​సైట్​లోకి వెళ్లాలి
  • అక్కడ హోం పేజీలో 'Know Your Application Number' ఆప్షన్ మీద క్లిక్ చేయాలి
  • అనంతరం వచ్చే పేజీలో మీ SSC హాల్​ టికెట్ నంబరు, విద్యా సంవత్సరం, పాస్ అయిన ఏడాది, పుట్టిన తేదీ, పదో తరగతి పాస్ అయిన రకాన్ని నమోదు చేయాలి
  • చివరగా వివరాలను Submit చేస్తే మీ అప్లికేషన్ నంబరు వస్తుంది

ఒకవేళ మీరు TS ePASS స్టేటస్​పై ఫిర్యాదు చేయాలనుకుంటే..

  • మొదట TS ePASS వెబ్‌సైట్​లోకి లాగిన్ అవ్వాలి
  • అక్కడ హోం పేజీలో 'Grievance' అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి
  • అనంతరం 'New Grievance Registration' ఆప్షన్ పై క్లిక్ చేయాలి
  • అక్కడ అడిగిన వివరాలను ఎంట్రీ చేయాలి. ఆ తర్వాత వచ్చిన క్యాప్చా కోడ్​ను నమోదు చేయాలి
  • చివరగా Submit బటన్​పై క్లిక్ చేస్తే మీ ఫిర్యాదు స్వీకరించబడుతుంది

Income limit for Scholarships : ఏడేళ్లుగా పెరగని 'ఆదాయ పరిమితి'

ఈ అమ్మాయిలు అమెరికాలో అడ్మిషన్ మాత్రమే కాదు.. రూ. కోట్ల స్కాలర్ షిప్.. సాధించారు!

ABOUT THE AUTHOR

...view details