తెలంగాణ

telangana

ETV Bharat / bharat

How to Check Driving Licence Status : డ్రైవింగ్​ లైసెన్స్​ దరఖాస్తు చేసుకున్నారా..? స్టేటస్ ఇలా తెలుసుకోండి! - ఆన్​ లైన్​లో తెలంగాణ డ్రైవింగ్ లైసెన్స్ స్టేటస్

Driving Licence Status in Online : మీరు డ్రైవింగ్ లెసెన్స్​కు దరఖాస్తు చేసుకున్నారా..? లెసెన్స్ ఎప్పుడు వస్తుందో క్లారిటీ లేదా..? అయితే.. ఇప్పుడే మీ ఫోన్ ద్వారా.. ఆన్​లైన్​లో స్టేటస్ చెక్ చేయండి.

Driving Licence Status in Online
How to Check Driving Licence Status in Online

By

Published : Aug 21, 2023, 2:29 PM IST

Telangana Driving Licence Status in Online : వాహనం ఏదైనా డ్రైవింగ్ లైసెన్స్ కంపల్సరీ. మోటార్ వెహికిల్ నిబంధనలు మరింత కఠినంగా మారిన తర్వాత.. లైసెన్స్ తప్పక తీసుకోవాల్సిన పరిస్థితి. అందుకే నిత్యం వేలాదిగా లైసెన్స్ దరఖాస్తులు ఆర్టీవో కార్యాలనికి పోటెత్తుతుంటాయి. ఈ క్రమంలోనే లైసెన్స్​లు జారీ కావడం ఆలస్యమయ్యే అవకాశం ఉంది. దీంతో.. అభ్యర్థులు తమ లైసెన్స్​ దరఖాస్తు తిరస్కరించారా..? ఏం జరిగి ఉంటుంది అనే ఆందోళనలో ఉంటారు. మరి కొంత మంది అప్లికేషన్లు పలు కారణాలతో.. నిజంగానే తిరస్కారానికి గురై ఉంటాయి. మరి, మీ డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తు ఏ స్టేజ్​లో ఉందో మీరు తెలుసుకోవాలని అనుకుంటున్నారా..? చాలా సింపుల్​గా ఇలా చెక్ చేసుకోండి.

ఇలా చేయండి..

  • లైసెన్స్ దరఖాస్తు స్టేటస్ తెలుసుకునేందుకు.. ముందుగా తెలంగాణ రవాణా శాఖ అఫీషియల్ వెబ్‌సైట్ లోకి వెళ్లాలి.
  • ఆ తర్వాత.. కొద్దిగా కిందకు స్క్రోల్ చేసిన తర్వాత "డాక్యుమెంట్ డెలివరీ స్టేటస్" అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయండి.
  • ఇప్పుడు ఆటోమేటెడ్ ఆన్‌లైన్ సర్వీసెస్ పేజీ (AOS) ఓపెన్ అవుతుంది.
  • ఇక్కడ.. "మాడ్యూల్‌ని ఎంచుకోండి" అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసి "లైసెన్స్" ను సెలక్ట్ చేయండి.
  • ఆ తర్వాత "ఇన్‌పుట్ టైప్"పై నొక్కి, డ్రాప్-డౌన్ నుండి "అప్లికేషన్ నంబర్" సెలక్ట్ చేసుకోవాలి.
  • ఇక్కడ అడిగిన వివరాలన్నీ ఎంటర్ చేసిన తర్వాత.. "గెట్ డీటెయిల్స్" ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
  • ఈ స్టెప్స్​ అన్నీ పక్కాగా పూర్తి చేసిన తర్వాత.. మీ లైసెన్స్ నంబర్ నుంచి.. కార్డ్ ప్రింట్ చేసిన తేదీ వరకు మొత్తం సమాచారం కనిపిస్తుంది.

రెండో పద్ధతి...

  • మొదటి పద్ధతిలో కుదరకపోతే.. రెండో పద్ధతి కూడా ఉంది. నేషనల్ గవర్నమెంట్ సేవల పోర్టల్ వెబ్‌సైట్ ద్వారా కూడా మీ లైసెన్స్​ దరఖాస్తు స్టేటస్ తెలుసుకోవచ్చు.
  • దీనికోసం ముందుగా.. "National Government Service" పోర్టల్​లోకి వెళ్లాలి.
  • హోమ్ పేజీలో సెర్చ్ బార్ కనిపిస్తుంది. ఇందులో.. "Application for driving Licence in Telangana" అని సెర్చ్ చేయండి. ఆ తర్వాత కిందకు స్క్రోల్ చేయండి.
  • ఇప్పుడు మీకు.. "Department of Road Transport Authority Fresh Driving Licence" అని కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయండి.
  • ఇప్పుడు మీరు తెలంగాణ రవాణా శాఖ వెబ్‌సైట్‌కి వెళ్తారు.
  • ఇక్కడి నుంచి.. మొదటి పద్ధతిలో చెప్పిన విధంగా సెర్చే చేస్తూ వెళ్తే సరిపోతుంది.

ఆఫ్​ లైన్లో ఎలా తెలుసుకోవాలి?

How to Check Driving Licence Status in Offline :

  • ఆఫ్​లైన్లో లైసెన్స్ దరఖాస్తు స్థితిని తెలుసుకోవాలంటే.. మీ సమీపంలోని లేదా మీరు డ్రైవింగ్ పరీక్షకు హాజరైన RTO కార్యాలయాన్ని సందర్శించాలి.
  • అక్కడ అధికారిని కలిసి.. మీ అప్లికేషన్​ నంబర్, పుట్టిన తేదీ వంటివి సమర్పించాలి.
  • ఈ సమయంలో మీ లెర్నర్ లైసెన్స్ చూపించమని కూడా అడిగే ఛాన్స్ ఉంది.
  • అయితే.. సాధారణంగా డ్రైవింగ్ టెస్ట్​ కంప్లీట్​ అయిన 2 వారాలలో లైసెన్స్ కార్డు ఇంటికే పంపిస్తారు.
  • రెండు వారాలు దాటినా కార్డు రాకపోతే.. అప్పుడు.. కార్యాలయానికి వెళ్లడం గానీ.. ఆన్​ లైన్​లో స్టేటస్ తెలుసుకోవడం గానీ చేయాలని చెబుతున్నారు అధికారులు.
  • ఒక్కోసారి పోస్టల్ సేవల జాప్యం కూడా.. కార్డు పొందడానికి ఆలస్యం కావచ్చు.
  • అందువల్ల.. అప్లై చేసిన తర్వాతి రోజు నుంచే.. స్టేటస్ చెక్ చేయడం వంటివి చేయకూడదు.

ABOUT THE AUTHOR

...view details