తెలంగాణ

telangana

ETV Bharat / bharat

How to Apply Learners License through Parivahan Sewa: ఆన్​లైన్​లో లెర్నర్​ లైసెన్స్​ కోసం ఇలా అప్లై చేయండి..! - ఆన్​లైన్​లో లెర్నర్​ లైసెన్స్

How to Apply Learners License in Parivahan Sewa: మీరు డ్రైవింగ్​ లైసెన్స్​ తీసుకోవాలనుకుంటున్నారా..? అంతకన్నా ముందు మీరు.. లెర్నర్స్ లైసెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. అయితే లెర్నర్స్ లైసెన్స్​కి ఎలా అప్లై చేయాలని ఆలోచిస్తున్నారా..?. టెన్షన్​ అవసరం లేదు. పరివాహన్​ సేవ​ ద్వారా చాలా సింపుల్​గా అప్లై చేసుకోవచ్చు. మరి అది ఎలానో ఈ కథనంలో తెలుసుకుందాం..

How to Apply Learners License
How to Apply Learners License

By ETV Bharat Telugu Team

Published : Sep 22, 2023, 10:12 AM IST

Updated : Sep 22, 2023, 10:29 AM IST

How to Apply Learners License in Parivahan Sewa :బైక్, స్కూటర్, కారు.. ఇలా ఏ వాహనాలను రోడ్డు మీద నడపాలన్నా డ్రైవింగ్ లైసెన్స్ ఉండాల్సిందే. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాన్ని నడిపితే అది శిక్షార్హమైన నేరం అవుతుంది. మోటార్ వెహికిల్స్​ చట్టం ప్రకారం.. పబ్లిక్ ప్లేస్‌లో లైసెన్స్ లేకుండా వెహికల్ నడపటం నిషేధం. గతంలో డ్రైవింగ్ లైసెన్స్ పొందాలంటే కొంత కష్టంగా ఉండేది. చెప్పులు అరిగేలా.. ఆర్టీవో ఆఫీసుల చుట్టూ తిరుగుతూ పడిగాపుల గాయాల్సి వచ్చేది. అయితే కొత్త టెక్నాలజీ సాయంతో ఇప్పుడు సులభంగానే డ్రైవింగ్ లైసెన్స్ పొందొచ్చు. ఆఫీస్‌ల చుట్టూ తిరగాల్సిన పని లేకుండానే ఆన్‌లైన్‌లోనే డ్రైవింగ్ లైసెన్స్ కోసం అప్లై చేసుకోవచ్చు. దీంతో చాలా వరకు టైమ్ ఆదా అవుతుంది. అలాగే ఎక్కువగా తిరగాల్సిన పని కూడా ఉండదు.

అయితే డ్రైవింగ్ లైసెన్స్ అవసరం ఉన్నవారు ఎవరైనా ముందు లెర్నింగ్ లైసెన్స్ పొందాలి. లెర్నర్స్ లైసెన్స్ జారీ అయిన నెల రోజుల తర్వాత మీరు డ్రైవింగ్ టెస్ట్‌కు వెళ్లాల్సి వస్తుంది. ఆర్‌టీఓ అధికారులు ఈ డ్రైవింగ్ టెస్ట్ పెడతారు. ఇలా టెస్ట్ పూర్తయిన తర్వాత మీకు లైసెన్స్ అందజేస్తారు. ఒకవేళ టెస్ట్‌లో ఫెయిల్ అయితే లైసెన్స్ రాదు. లైర్నర్స్ లైసెన్స్ తీసుకున్న వారు ఆరు నెలలలోగా డ్రైవింగ్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. అయితే లెర్నర్​ లైసెన్స్​ను కేవలం ఇంట్లో కూర్చొనే ఆన్​లైన్​లో చాలా సింపుల్​గా అప్లై చేసుకునే విధానాన్ని ఈ పోర్టల్​ కల్పిస్తోంది. అదే పరివాహన్​ సేవా. ఈ వెబ్​సైట్​ను ఉపయోగించి లెర్నింగ్ లైసెన్స్ కోసం ఎలా అప్లై చేసుకోవాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం..

మీరు ఆర్సీ, డీఎల్​ కార్డు కోసం ఎదురుచూస్తున్నారా.. అయితే ఇక ఆ విషయం మర్చిపోండి!

పరివాహన్​ సేవ ద్వారా లెర్నర్​ లైసెన్స్​కు ఎలా అప్లై చేసుకోవాలి..?

Procedure to Apply Learners License in Parivahan Sewa..?

  • ముందుగా మీరు పరివాహన్​ సేవ అధికారిక వెబ్​సైట్​ https://parivahan.gov.in/parivahan/ ఓపెన్​ చేయండి.
  • హోమ్​ పేజీలో లైసెన్స్​ రిలేటెడ్​ సర్వీసెస్​లో Drivers/Licence Licence కాలమ్​లో More ఆప్షన్​పై క్లిక్​ చేయండి.
  • కొత్త పేజీ ఓపెన్​ అవుతుంది. అందులో State ను సెలెక్ట్​ చేసుకోవాలి. అయితే ప్రస్తుతం అన్ని రాష్ట్రాల పేర్లు ఈ జాబితాలో లేవు. అందువల్ల లిస్ట్‌లో ఉన్న రాష్ట్రాల్లోనే లెర్నర్​ లైసెన్స్ కోసం అప్లై చేసుకోవడానికి వీలవుతుంది.
  • తర్వాత Apply for Learner License ఆప్షన్​పై క్లిక్​ చేయండి.
  • అనంతరం Continue బటన్​ను నొక్కండి.
  • తర్వాత ‘Applicant does not hold any Driving/Learner licence issued in India ఆప్షన్​ను క్లిక్​ చేసి.. కేటగిరి సెక్షన్​లో General ను ఎంపిక చేసి.. Submit బటన్​పై క్లిక్​ చేయండి.
  • అథంటికేషన్​ విత్​ ఇ కేవైసీ కాలమ్​లో ఆధార్​ లేదా వర్చువల్​ ఐడీని ఎంటర్​ చేసి Generate OTP ఆప్షన్​ను ఎంచుకోవాలి.
  • అప్పుడు ఆధార్​కు లింక్​ అయిన మొబైల్​కు OTP వస్తుంది.
  • ఆ ఓటీపీని ఎంటర్​ చేసి Authenticate ఆప్షన్​పై క్లిక్​ చేయాలి.
  • అనంతరం స్క్రీన్​పై అప్లికేషన్​ ఫారమ్​ ఓపెన్​ అవుతుంది.
  • తర్వాత అప్లికేషన్​ ఫారమ్​లో పూర్తి వివరాలు ఎంటర్​ చేయాలి.
  • అనంతరం డాక్యుమెంట్లను అప్​లోడ్​ చేయాలి. (అడ్రస్​ ప్రూఫ్​, ఏజ్​ ప్రూఫ్​)
  • చెల్లింపు స్థితిని కొనసాగించడానికి అలాగే ధృవీకరించడానికి అవసరమైన ఫీజును చెల్లించండి.
  • అనంతరం కాపీని డౌన్​లోడ్​ చేసుకుని ప్రింట్​ తీసుకోండి.
  • అంతే మీ లెర్నర్​ లైసెన్స్​ కోసం కావాల్సిన స్లాట్​ బుకింగ్​ విధానం పూర్తి అవుతుంది.

Note:అథంటికేషన్​ విధానం మీరు ఎంచుకున్న రాష్ట్రాన్ని బట్టి ఉంటుందనే విషయాన్ని గమనించాలి.

డిజిలాకర్​తో మీ డాక్యుమెంట్లు సేఫ్.. ఎలా వాడాలో తెలుసా..?

డ్రైవింగ్ లైసెన్స్ కోసం 960సార్లు టెస్ట్​కు హాజరు.. రూ.11 లక్షలు ఖర్చు.. చివరకు..

How to Check Driving Licence Status : డ్రైవింగ్​ లైసెన్స్​ దరఖాస్తు చేసుకున్నారా..? స్టేటస్ ఇలా తెలుసుకోండి!

Last Updated : Sep 22, 2023, 10:29 AM IST

ABOUT THE AUTHOR

...view details