Rythu Bandhu Scheme in Telangana : తెలంగాణ సర్కారు అన్నదాతలకు అండగా నిలిచేందుకు 'రైతు బంధు' అనే సంక్షేమ పథకానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. వ్యవసాయం కోసం పెట్టుబడిని బుుణంగా నగదు రూపంలో రైతన్నకు అందించి ఆర్థికంగా తోడ్పాటు అందించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ 2018 ఫిబ్రవరి 25న 'రైతు బంధు'(Rythu Bandhu) పథకాన్ని ప్రకటించారు. తాను ఎంతగానో అభిమానించే ఈ పథకాన్ని సీఎం కేసీఆర్.. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలోని శాలపల్లి వద్ద 2018, మే 10న ప్రారంభించారు.
Telangana Rythu Bandhu Scheme : తొలుత ఈ పథకం ద్వారా ఎకరానికి ఖరీఫ్‌లో రూ. 4వేలు, రబీలో రూ.4 వేల చొప్పున ఏడాదికి 8 వేల రూపాయలను ప్రభుత్వం అందించింది. తరువాత ఈ పంట పెట్టుబడి సాయాన్ని ఎకరానికి రూ. 5వేలకు పెంచి.. ఏటా ఎకరానికి రూ.10 వేల చొప్పున రైతుల ఖాతాల్లో సర్కార్ జమ చేస్తుంది. ఇది దేశంలోనే మొట్టమొదటి రైతు పెట్టుబడి సాయం పథకమని తెలంగాణ సర్కార్ చెబుతోంది.
Rythu Bandhu Funds 2023 : తాజాగా జూన్ 2023లో 11వ రైతుబంధు నిధులను ప్రభుత్వం విడుదలచేసిన విషయం తెలిసిందే. మొత్తం 11విడుతల్లో ఈ పథకం ద్వారా రూ.72,910 కోట్ల ఆర్థిక సాయం సర్కార్ రైతులకు అందించింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ దఫా కొత్తగా ఐదు లక్షల మంది అన్నదాతలకు ఈ పథకాన్ని వర్తింపజేసింది. రాష్ట్రంలో సుమారు 70లక్షల మందికి వానాకాలం సీజన్‌కుగానూ ఇటీవల విడుదల చేసిన 11వ విడుత రైతుబంధు నిధులు జమకానున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. ఈ నగదు అర్హులైన ఆయా రైతుల ఖాతాలో దశల వారీగా డిపాజిట్ కానుంది.
Telangana Rythu Bandhu Funds 2023 : రైతుబంధు నిధుల విడుదల.. రైతుల ఖాతాల్లో జమ
తెలంగాణ సర్కార్ అమలు చేస్తున్న ఈ 'రైతు బంధు' పథకానికి అర్హులుగా ఈ ఏడాది పోడు భూముల పట్టాలు పొందినవారిని అర్హులుగా ప్రభుత్వం పేర్కొంది. ఈ క్రమంలో రైతుబంధు పథకం అందని రైతులు, కొత్తగా భూములు కొనుగోలు చేసిన రైతులు, కొత్తగాపోడు పట్టాలు పొందిన రైతులు(Podu Lands Patta Distribution in Telangana) ఈ పథకం పరిధిలోకి రావాలంటే మొదట దరఖాస్తు చేసుకోవాలి. కాబట్టి నూతన లబ్ధిదారులు దరఖాస్తు సమయంలో ఏయే ఏయే పత్రాలు సమర్పించాలి, ఎలా అప్లై చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..
దరఖాస్తు సమయంలో కావాల్సిన పత్రాలు :
1. రైతుబంధు దరఖాస్తు ఫారం
2. దరఖాస్తుదారుని పాస్‌బుక్
3. ఆధార్ కార్డు
4. ఓటరు గుర్తింపు కార్డు
5. బ్యాంక్ అకౌంట్ వివరాలు
రైతుబంధు పథకానికి దరఖాస్తు చేసుకునే విధానం :పైన పేర్కొన్న పత్రాలతో కొత్తగా దరఖాస్తు చేసుకునే లబ్ధిదారుడు మొదట సంబంధింత గ్రామ వ్యవసాయ అధికారిని గానీ, మండల రెవెన్యూ అధికారిని గానీ సంప్రదించి దరఖాస్తు(How to Apply Rythu Bandhu Scheme in Telugu) సమర్పించాలి. అప్పుడు సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి లబ్ధిదారులను ఎంపిక చేస్తారు. తాజాగా 11వ విడుత ఎంపికైన లబ్ధిదారుల జాబితాను ప్రభుత్వం విడుదల చేసింది. అయితే మీరు ఆ జాబితాలో ఉన్నారో లేదో.. ఒకవేళ ఉంటే అనంతరం మీ రైతు బంధు పేమెంట్ స్టేటస్ ఏ విధంగా ఆన్లైన్లో సింపుల్‌గా ఇలా తెలుసుకోండి.
Rythu Bandhu scheme: రైతుల అకౌంట్‌లో డబ్బులు పడ్డాయ్..
మీరు రైతుబంధు అర్హుల జాబితాలో ఉన్నారో లేదో తెలుసుకోండిలా..
1. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన రైతుబంధు అర్హుల జాబితాలో మీ పేరు ఉన్నదో లేదో తెలుసుకునేందుకు.. మొదట మీరు అధికారిక వెబ్ సైట్లోకి వెళ్లాలి.