బిహార్ ఐజీ రివాల్వర్ చోరీకి గురైంది. తన ఇంట్లో పనిచేసే ఓ వ్యక్తే ఈ దొంగతనం చేసినట్లు ఐజీ ఓ ప్రకటన ద్వారా తెలిపారు. కొత్త ఫోన్ కొనడానికి డబ్బులు లేనందునే నిందితుడు.. రివాల్వర్ కాజేసి తన స్నేహితుడికి విక్రయించినట్లు చెప్పారు. దొంగని అరెస్ట్ చేసిన పోలీసులు విచారణ చేస్తున్నట్లు వెల్లడించారు.
ఫోన్ కొనడానికి డబ్బులు లేవని ఐజీ రివాల్వర్ చోరీ!
కొత్త ఫోన్ కొనడానికి డబ్బులు లేవని ఐజీ రివాల్వర్‌నే కాజేశాడు ఓ దొంగ. తన ఇంట్లో పనిచేసే వ్యక్తే ఈ దొంగతనానికి పాల్పడినట్లు పోలీసు అధికారి వెల్లడించారు. ఈ ఘటన బిహార్‌లో జరిగింది.
అసలు ఏం జరిగిందంటే..
పట్నాకు చెందిన ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ వికాశ్ వైభవ్ ఇంట్లో దొంగతనం జరిగింది. ఈ ఘటనలో సెల్ఫ్‌లో ఉంచిన రివాల్వర్, 25 బుల్లెట్లు చోరీ జరిగినట్లు ఐజీ వెల్లడించారు. దీనిపై ఐజీ గార్దానీబాగ్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. ఐజీ ఇంటి చుట్టూ అమర్చిన సీసీటీవీ దృశ్యాలను పరిశీలించారు. ఐజీ ఇంట్లో పనిచేసే సూరజ్ కుమార్‌పై అనుమానం వ్యక్తం చేశారు. దీంతో కుమార్‌ను విచారించగా తానే ఈ దొంగతనం చేసినట్లు అంగీకరించాడు. కొత్త ఫోన్ కొనడానికి డబ్బులు లేనందునే దొంగతనానికి పాల్పడినట్లు ఒప్పుకున్నాడు. దొంగిలించిన అనంతరం దాన్ని ఉద్దాన్ ప్రాంతానికి చెందిన తన మిత్రుడు.. సుమిత్‌కు విక్రయించినట్లు తెలిపాడు.
"ఈ రోజు ఉదయం నా సర్వీస్ రివాల్వర్ కనిపించలేదు. నా భార్యను ఈ విషయం అడగగా తనకి తెలియదని చెప్పింది. మా ఇంట్లో పనిచేసే సూరజ్ కుమార్ అనుమానాస్పదంగా నా గది నుంచి బయటకు వస్తున్నట్లు నాకు తెలిసింది. నా గదిలోకి ప్రవేశం ఉన్న బయట వ్యక్తి సూరజ్ ఒక్కడే. అందుకే అతన్ని విచారించగా అసలు విషయం బయటపడింది."
-- వికాశ్ వైభవ్, బిహార్ ఐజీ