Horoscope Today: ఈ రోజు మీ రాశి ఫలం ఎలా ఉందంటే? - horoscope today
Horoscope Today : ఈ రోజు(సెప్టెంబరు 11) రాశి ఫలం గురించి డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే?
Etv Bharat
By
Published : Sep 11, 2022, 6:20 AM IST
Horoscope Today : ఈ రోజు(సెప్టెంబరు 11) రాశి ఫలం గురించి డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే?
ప్రారంభించబోయే పనుల్లో ప్రతికూల పరిస్థితులు ఎదురవకుండా చూసుకోవాలి. కీర్తి పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి చేసే పనులు ఫలిస్తాయి. ఇష్టదైవ ప్రార్థన చేస్తే మంచిది.
ఉత్సాహభరితమైన వాతావరణం ఉంటుంది. పెద్దలు మీకు కొత్త బాధ్యతలను అప్పగిస్తారు. మానసికంగా దృఢంగా ఉంటారు. బంధువుల గృహాలలో సుఖ భోజనం చేస్తారు. కీలక విషయాల్లో శుభపరిణామాలు చోటుచేసుకుంటాయి. ఇష్టదైవ నామస్మరణ మంచిది.
నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. శారీరక శ్రమ కాస్త పెరగుతుంది. బంధువులతో వాదులాటలకు దిగకపోవడమే మంచిది. అనవసర ధనవ్యయం జరిగే సూచనలు ఉన్నాయి. అధికారులను మెప్పించడానికి కాస్త కష్టపడాల్సి వస్తుంది. దైవారాధన మానవద్దు.
కీలకమైన పనులను ప్రారంభిస్తారు. మీ ధర్మం మిమ్మల్ని ఉన్నతుల్ని చేస్తుంది. మొహమాటం వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఆహార నియమాలను పాటించాలి. శ్రీ వేంకటేశ్వర స్వామిని సందర్శించడం మంచిది.
ముఖ్య విషయాల్లో పెద్దల ఆశీర్వచనాలు అందుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. అనవసర ధనవ్యయం సూచితం. ఇష్టదేవతా స్తోత్రం పారాయణ చేస్తే మంచిది.
ప్రారంభించిన పని నిర్విఘ్నంగా పూర్తవుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో మేలైన ఫలితాలు ఉంటాయి. ఆర్థికపరమైన విషయాలలో మీరు ఆశించిన ఫలితాలు వస్తాయి.ఇష్టదైవారాధన శుభప్రదం.
ఉత్సాహంగా పనిచేస్తారు. బంధువుల సహకారం లభిస్తుంది. ప్రతీ విషయాన్ని కుటుంబంతో చర్చించి ప్రారంభించాలి. సౌభాగ్యసిద్ధి ఉంది. లక్ష్మీ సహస్రనామం చదివితే మంచి జరుగుతుంది.
ప్రశాంతమైన మనస్సుతో ముందుకు సాగండి, అన్నీ మంచి ఫలితాలే పొందుతారు.బంధు, మిత్రులతో ఆనందంగా గడుపుతారు. భోజన సౌఖ్యం కలదు. గణపతిని ఆరాధించడం మంచిది.
మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. శారీరక శ్రమ పెరుగుతుంది. కొందరి ప్రవర్తనాశైలి మిమ్మల్ని బాధిస్తుంది.అధికారులతో అప్రమత్తంగా ఉండాల్సిన సమయం. విష్ణు నామస్మరణ శుభప్రదం.
శరీరసౌఖ్యం కలదు. భవిష్యత్తు ప్రణాళికలను రచిస్తారు. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. తోటివారితో ఆనందంగా గడుపుతారు. కాలం అనుకూలంగా ఉంది. సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధిస్తే మంచిది.
చేపట్టిన పనుల్లో శ్రమ పెరుగుతుంది. కుటుంబసభ్యుల సలహాలతో ముందుకు సాగడం మంచిది. శారీరక శ్రమ కాస్త పెరుగుతుంది.బంధు,మిత్రులతో విబేధాలు రావచ్చు. చంద్ర శ్లోకం చదవాలి.
ప్రారంభించబోయే పనుల్లో విజయం చేకూరుతుంది. సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. కొన్ని సంఘటనలు సంతోషాన్ని ఇస్తాయి. దైవారాధన మానవద్దు.