తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (13/08/2022) - Horoscope Today news

Horoscope Today (13-08-2022): ఈ రోజు రాశిఫలాల గురించి డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే..

Horoscope Today
Horoscope Today

By

Published : Aug 13, 2022, 6:22 AM IST

Horoscope Today (13-08-2022): ఈ రోజు రాశిఫలాల గురించి డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే..

సకాలంలో పనులు పూర్తి అవుతాయి. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. బంధు,మిత్రులతో కలిసి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. భవిష్యత్తు ప్రణాళికలు వేస్తారు. శివనామాన్ని జపం చేయండి.

మీ మీ రంగంలో శ్రమ పెరగకుండా ముందుచూపుతో వ్యవహరించాలి. మీ బంధువుల ప్రవర్తన వల్ల మీకు కాస్త మనస్తాపం కలుగుతుంది. శారీరక శ్రమ పెరుగుతుంది. ధనవ్యయం పెరిగే అవకాశాలు ఉన్నాయి. శ్రీహరిని ఆరాధిస్తే మంచిది.

విఘ్నాలను తెలివిగా పరిష్కరిస్తారు. చంచల స్వభావంతో ఇబ్బందులు ఎదురవుతాయి. మీ పై అధికారులతో అప్రమత్తంగా ఉండాల్సిన సమయం. దుష్టులను దరిచేరనీయకండి. ఈశ్వర సందర్శనం ఉత్తమ ఫలితాన్ని ఇస్తుంది.

మిశ్రమకాలం. తోటివారితో కలిసి తీసుకునే నిర్ణయాలు మేలు చేస్తాయి. పనులకు ఆటంకం కలుగకుండా చూసుకోవాలి. మనఃపీడ ఉంటుంది. మనోబలం కోసమై దుర్గాదేవి ఆరాధన శుభప్రదం.

లక్ష్యాలను చేరుకునే దిశగా ఆలోచనలు చేస్తారు. పెద్దల పట్ల గౌరవ మర్యాదలు కలిగి ఉంటారు. వస్త్రలాభం పొందుతారు. శ్రీరామనామాన్ని జపించడం ఉత్తమం.

చేపట్టిన పనులలో విజయాన్ని సాధిస్తారు. బంధు,మిత్రులతో సంతోషంగా గడుపుతారు. అభివృద్ధి కోసం మీరు తీసుకునే నిర్ణయాలు ఫలిస్తాయి. శివారాధన శుభప్రదం.

పట్టుదలతో పనులను పూర్తిచేస్తారు. ఆదాయానికి మించి ఖర్చులు ఉంటాయి. ముఖ్య విషయాల్లో ఆచితూచి అడుగు వేయాలి. కలహ సూచన ఉంది కాబట్టి మాట విలువను కాపాడుకోవాలి. హనుమత్ ఆరాధన శుభప్రదం.

మీ మీ రంగాల్లో కొన్ని ఇబ్బందులు ఎదురైనా వాటిని అదిగమించే ప్రయత్నం చేస్తారు. ఆత్మవిశ్వాసం తగ్గకుండా చూసుకోవాలి. అందరినీ కలుపుకొనిపోవడం ఉత్తమం. శ్రీసూక్తం విన్నా, చదివినా మంచి ఫలితాలు సాధిస్తారు.

మీ మీ రంగాల్లో ప్రోత్సాహకరమైన వాతావరణం నెలకొంటుంది. సంతోషకరమైన కాలాన్ని గడుపుతారు. ఒక వార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. అనవసర విషయాల్లో తలదూర్చరాదు. నరసింహస్వామి ఆరాధన శుభప్రదం.

ధర్మసిద్ధి ఉంది.సమస్యలు తొలగి కుదురుకుంటారు. భోజన సౌఖ్యం ఉంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. సుబ్రహ్మణ్య భుజంగ స్తవం చదివితే బాగుంటుంది.

గ్రహబలం బాగుంది. మీ మీ రంగాల్లో అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. ఒక శుభవార్త మీ ఇంట సంతోషాన్ని నింపుతుంది. బుద్ధిబలం బాగుండటం వలన కీలక సమయాలలో పెద్దలు లేదా అధికారుల ప్రశంసలు పొందుతారు. శ్రీసుబ్రహ్మణ్యస్వామిని ఆరాధించాలి.

మిశ్రమ కాలం. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. అవసరానికి తగిన సహాయం అందుతుంది. ఆర్థిక అంశాలలో ఆచితూచి ముందుకు సాగాలి. శివనామస్మరణ మంచిది.

ఇవీ చదవండి:40 అంతస్తుల ట్విన్​ టవర్స్​ కూల్చివేత ఆలస్యం.. కారణమిదే

ఫుల్​గా మందు కొట్టిన హెడ్ మాస్టర్​.. తూలుతూ పాఠశాలకు..

ABOUT THE AUTHOR

...view details