Horoscope Today:ఈ రోజు మీ రాశిఫలం ఎలా ఉందో తెలుసా? - telugu panchangam
Horoscope Today: ఈ రోజు (మార్చి 17) రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే?
Horoscope Today
By
Published : Mar 17, 2023, 6:23 AM IST
Horoscope Today: ఈ రోజు (మార్చి 17) రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే?
ఈ రోజు మీరు కాస్త జాగ్రత్తగా వ్యవహరించండి. ఆఫీసులో పనులు చక్కబెట్టడం మీకు కఠినంగా ఉంటుంది. మీ ఉన్నతాధికారులతో మాట్లాడేటప్పుడు సౌమ్యంగా ఉండండి. అది మీకు మేలు చేస్తుంది.
ఈ రోజు మీరు అవిశ్రాంతంగా ఉంటారు. ఇది మీ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. మీ కోపాన్ని, మాటలను నియంత్రణలో పెట్టుకోండి. పనిలో మీకు ఆటంకాలు ఎదురవుతాయి కాబట్టి కొత్త పనులకు ఈ రోజు దూరంగా ఉండండి.
పనులన్నీ పక్కనపెట్టి ఈ రోజు హాయిగా గడపండి. మీకు సంతోషం కలిగించే అనేక పనుల్లో మీరు పాల్గొంటారు. అది షాపింగ్, భోజనం, సాహస క్రీడలు లేదా ఏదైనా వినోదం కూడా కావచ్చు. అయితే, సాయంత్రానికి మీరు బాగా ఎమోషనల్ అవుతారు.
ఈ రోజు మీకు ప్రయోజనకరంగా మారుతుంది. మీ తల్లి తరపు నుంచి వచ్చే శుభవార్త మీ ఇంటి వాతావరణాన్ని ఆనందభరితం చేస్తుంది. మీ శారీరక, మానసిక స్థితి ఈ రోజు అద్భుతంగా ఉంటుంది.
ఈరోజు మీ ఇంటి వద్ద వాతావరణం స్నేహపూర్వకంగా, ప్రశాంతంగా ఉంటుంది. ఆఫీసు వాతావరణం అనుకూలంగా ఉంటుంది. అంతేగాక, మీరు చెడు ఆహార అలవాట్ల నుండి దూరంగా ఉంటే, మీ ఆరోగ్యం బాగుంటుంది. వ్యాపారస్థులకు ఈరోజు లాభాలు, లభిస్తాయి.
ఈరోజు మీకు సమస్యాత్మకంగా ఉంటుంది. మీరు మీ మనసును, శరీరాన్ని, ఆత్మను చురుగ్గా ఉంచడంలో సఫలీకృతం అయితే.. సమస్యలను ఎదుర్కోగలరు. వ్యక్తిగతంగా ఈరోజు కఠినంగా ఉంటుంది. ప్రతి అడుగు ఆచితూచి వేయండి.
కొత్త ప్రాజెక్టులు మొదలు పెట్టేందుకు మంచి రోజు. మీ బాల్య మిత్రులను కలుసుకుని సరదాగా గడిపేందుకు ఇదే సరైన సమయం. మీ కీర్తి ప్రతిష్ఠలు, గౌరవం పెరుగుతాయి. మీ ఆస్తి వ్యవహారాల్లో జాగ్రత్త వహించండి.
ఈరోజు ప్రతికూలమైన రీతిలో మొదలవుతుంది కానీ సానుకూలమైన రీతిలో ముగుస్తుంది. ఉదయం అన్నీ రంగాల్లో కఠినంగా ఉంటుంది. ప్రత్యేకంగా వృత్తి నిపుణులకు ఎక్కువ పని ఒత్తిడి, తక్కువ ఫలితాలు మీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తాయి. ఓపికతో ఉండండి, పరిస్థితులు సాయంత్రానికి మెరుగవుతాయి.
ఈరోజు మీకు సాధారణంగా ఉంటుంది. మొదటి సగభాగంలో సంతోషం, సంతృప్తితో నిండుగా ఉంటుంది. రోజు రెండవ భాగం కాస్త సమస్యాత్మకంగా ఉంటుంది. మధ్యాహ్నం తరువాత ఆర్ధిక లాభాలు, సామాజిక సమావేశాలు, దేవాలయాలకు పర్యటన చేసే అవకాశం ఉంది. మీకు మీ జీవిత భాగస్వామి కూడా మద్దతుగా, సహాయకరంగా ఉంటారు.
ఉదయం కొన్ని సవాళ్లు తప్పించి, ఆందోళన చెందడానికి అంతగా ఏమీ ఉండదు. రోజు మొదటి సగభాగంలో, మీరు అప్రమత్తంగా, జాగ్రత్తగా ఉండాలి. ప్రత్యేకంగా మీరు ఒక చట్టపరమైన వివాదంలో సాక్షిగా చిక్కుకుంటారు. డ్రైవింగ్ చేసేటప్పుడు వేగంగా వెళ్లకండి.
ఈరోజు మీరు సామాజికంగా, ఆర్థికపరంగా అభివృద్ధి చెందుతారు. ఇంటి వద్ద వాతావరణం ప్రశాంతంగా ఉండదు.
మీ వ్యాపారం అద్భుతంగా సాగుతుంది. ఇది మిమ్మల్ని ఉచ్ఛస్థితికి తీసుకెళ్తుంది. మీ పని మీ ఉన్నతాధికారులకు సంతోషం కలిగిస్తుంది. మీపై వారికి సానుకూల దృక్పథం ఏర్పడుతుంది. మీ ఆదాయం పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.