Horoscope Today: ఈ రోజు మీ రాశి ఫలం ఎలా ఉందో చూసుకున్నారా? - horoscope today in telugu
Horoscope Today: ఈ రోజు(ఫిబ్రవరి 7) రాశి ఫలాల గురించి శంకరమంచి డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే?..
horoscope today
By
Published : Feb 7, 2023, 6:18 AM IST
Horoscope Today: ఈ రోజు(ఫిబ్రవరి 7) రాశి ఫలాల గురించి శంకరమంచి డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే?..
ప్రారంభించిన పనులను పూర్తిచేయడానికి చిత్తశుద్ధి చాలా అవసరం. అనవసర విషయాలతో కాలాన్ని వృథా చేయకండి. సాహసోపేతమైన విజయాలు ఉన్నాయి. శివారాధన శుభప్రదం.
మిశ్రమ వాతావరణం ఉంది. బుద్ధిబలంతో వ్యవహరిస్తే ఆటంకాలు దూరం అవుతాయి.ఎలాంటి పరిస్థితుల్లోనూ మనోధైర్యాన్ని కోల్పోవద్దు. అనారోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయకండి. శత్రువుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దు. అనవసరంగా ఆందోళనపడతారు. దైవారాధన మానవద్దు.
విందు,వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. భవిష్యత్ ప్రణాళికలు వేస్తారు. సంతోషకరమైన వార్తలు వింటారు. ఆర్థిక లాభాలు ఉన్నాయి. హనుమంతుడిని ఆరాధించాలి.
కర్మసిద్ధి ఉంది. ధైర్యంతో ముందడుగు వేసి అనుకున్న పనిని పూర్తి చేయగలుగుతారు. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి. బద్ధకాన్ని దరిచేరనీయకండి. శ్రీవేంకటేశ్వర స్వామి సందర్శనం శుభప్రదం.
చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తిచేయగలుగుతారు.ఆర్ధికాభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు లాభాన్ని చేకూరుస్తాయి.ఈశ్వర ఆరాధన శుభప్రదం.
కీలక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి.బంధు, మిత్రులతో కలిసి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుని భవిష్యత్తు ప్రణాళికలు వేస్తారు. హనుమాన్ చాలీసా చదవాలి.
మనఃస్సౌఖ్యం ఉంది. చేపట్టే పనుల్లో మంచి ఫలితాలు రాబడతారు. మీ మీ రంగాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. ఇష్టమైన వారితో కాలాన్ని గడుపుతారు. ఆంజనేయుడిని ఆరాధిస్తే మంచిది.
గ్రహ అనుగ్రహం సంపూర్ణంగా ఉంది. మీ మీ రంగాల్లో చక్కటి శుభఫలితాలను అందుకుంటారు. ఒక ముఖ్య విషయమై అధికారులను కలుస్తారు. ఫలితం సానుకూలంగా వస్తుంది. బంధు,మిత్రులతో ఆనందంగా గడుపుతారు. విష్ణు ఆరాధన చేస్తే మంచిది.
ప్రారంభించిన పనిలో తోటివారి సహకారం లభిస్తుంది. ఆర్థికంగా పురోగతి ఉంటుంది. ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది. దగ్గరివారిని దూరం చేసుకోకండి. శ్రీరామనామాన్ని జపిస్తే మేలు జరుగుతుంది.
వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో మీ అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు వింటారు. వ్యాపార లాభాలు ఉన్నాయి. సమయపాలనతో పనులను పూర్తిచేస్తారు. విష్ణు ఆలయ సందర్శనం శుభప్రదం.
శుభసమయం. కీలక వ్యవహారంలో పెద్దలు మీకు అనుకూల నిర్ణయం తీసుకుంటారు. కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. శివాష్టోత్తరం చదవాలి.
చక్కటి ఆలోచనలతో ముందుకు సాగండి. కొన్నాళ్లుగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న ఒక సమస్యకు పరిష్కారం లభిస్తుంది. కుటుంబంలో చిన్నపాటి సమస్యలు వస్తాయి. గణపతి ఆరాధన శుభప్రదం.