తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఆ రాశివారికి ప్రమోషన్​ వచ్చే ఛాన్స్​! - తెలుగు రాశి ఫలాలు మీన రాశి

Horoscope Today December 29th 2023 : డిసెంబర్​ 29న (శుక్రవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

Horoscope Today December 29th 2023
Horoscope Today December 29th 2023

By ETV Bharat Telugu Team

Published : Dec 29, 2023, 5:08 AM IST

Horoscope Today December 29th 2023 : డిసెంబర్​ 29న (శుక్రవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

మేషం (Aries) :ఈ రోజు మేష రాశివారికి భావోద్వేగాలను నియంత్రించడం సవాలుగా ఉంటుంది. మీ అంతర్గత ఆలోచనలను సులభంగా ఆపుకోలేరు. కానీ మీరు ఇప్పుడు అలా చేయక తప్పదు. జాగ్రత్తగా ఉండండి. మీ బలహీనతను ప్రదర్శించకండి.

వృషభం (Taurus) : ఈ రోజు మిమ్మల్ని ఆందోళన, ఒత్తిళ్లు చుట్టుముడతాయి. కానీ అవన్నీ కూడా తొలిగిపోయి మీరు సంతోషంగా ఉంటారు. మీ కుటుంబసభ్యులు, స్నేహితులతో సమావేశం ఏర్పాటు చేస్తారు. మీరు చాలా సృజనాత్మకంగా ఉంటారు.

మిథునం (Gemini) :ఈ రోజు మీకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మీరెంత అలసిపోయినా మీ ప్రియమైనవారికి మీరు సంతోషాన్ని కలిగిస్తారు. మీది అనుకూల వైఖరి కావడం వల్ల మీ పనిలో కూడా ఆ ప్రభావం కనిపిస్తుంది. ఫలితంగా మీ తోటి ఉద్యోగుల ప్రోత్సాహాన్ని అందుకుంటారు. మీ ఆర్థిక సంబంధమైన నిల్వలు రోజు రోజూకి తగ్గి పోతున్నాయి. ఇంట్లో శాంతియుత వాతావరణం ఉంటుంది.

కర్కాటకం (Cancer) :ఈ రోజు కర్కాటక రాశివారు స్నేహితులతో ఉల్లాసంగా గడుపుతారని ఫలితాలు చెబుతున్నాయి. మీకున్న అనుకూల వాతావరణంతో హాయిగా, ఆనందంగా ఉంటారు. స్నేహితులు, కుటుంబ సభ్యులతో బయటికి వెళ్లి సంతోషంగా గడుపుతారు. మీ భార్యతో ఆనందంగా కాలక్షేపం చేస్తారు. ఆమె నుంచి ఒక శుభవార్త అందుకుంటారు.

సింహం (Leo) : సింహ రాశివారు ఈ రోజు చాలా జాగ్రత్తగా ఉండాలని ఫలితాలు చెబుతున్నాయి. మీకు అనుకూలంగా లేని భావోద్వేగాల ప్రభావం మీపై ఉంటుంది. ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచన చేయండి. తారాబలం బలహీనంగా ఉంది. వీలైతే మీ ప్రియమైన వారితో వివాదాలకు దూరంగా ఉండండి.

కన్య (Virgo) :మీ ఎదురు చూపులకు ముగింపు పలికే తరుణం వచ్చింది. ఈ రోజు మీకు వ్యక్తిగతంగా, వృత్తిపరంగా ప్రయోజనం ఉంటుంది. మీకు సంపద కలుగుతుంది. ప్రశాంతమైన ప్రయాణం చేసే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ ప్రయాణంలో మీరు మీ స్నేహితులతో సన్నిహితమవడమే కాకుండా మీ భాగస్వామితో మంచి కెమిస్ట్రీ ఏర్పడుతుంది.

తుల (Libra) :తుల రాశివారికి ఈ రోజు అదృష్టం మిశ్రమంగా ఉంటుంది. మీ ఇంట్లో, ఆఫీస్​లో వాతావరణం సమన్వయ ధోరణిలో ఉంటుంది. ఉన్నతాధికారులు మీ నైపుణ్యానికి ప్రశంసలిస్తారు. ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వానికి లేదా న్యాయ సంబంధమైన పనికి ఆమోదం పొందవచ్చు. ఒప్పందాలకు ఈ రోజే సరైనది.

వృశ్చికం (Scorpio) :ఈ రోజు మీరు మానసికంగా, శారీరకంగా చాలా అలిసిపోతారు. మీరు వ్యాపారంలో ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. మీకు చికాకు కలుగుతుంది. మీ పిల్లల ఆరోగ్యం జాగ్రత్త. కష్టాలు, ఖర్చులు ఉండవచ్చు. జాగ్రత్తగా చూసుకోండి. ముఖ్యమైన నిర్ణయాలు ఈ రోజు తీసుకోకండి. మీరు కొన్ని రాజకీయ ఆరోపణలు ఎదుర్కొవాల్సి రావచ్చు. చింత లేకుండా ఉండండి. అవన్నీ ఒక కొలిక్కి వస్తాయి. ఈ కష్టం కూడా వెళ్లి పోతుంది.

ధనుస్సు (Sagittarius) : మీకు ఈ రోజంతా ఊహించని ఘటనలతో నిండిపోయి ఉంటుంది. మీరు తీరిక లేకుండా ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. ఈ రోజు తలెత్తే సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేయకండి. అధిక సున్నితత్వం కారణంగా మానసిక ఒత్తిడి పెరుగుతుంది. మీ భాగస్వామితో వ్యవహరించేటప్పుడు లౌక్యంగా ఉండండి. గౌరవప్రదంగా, మర్యాదపూర్వకంగా ఉండండి.

మకరం (Capricorn) : మకర రాశివారికి ఆదాయం వృద్ధి చెందుతుంది. ప్రతి పనిలో రాణిస్తూ అందరికీ విశ్వాసపాత్రంగా ఉంటారు. మీరు బిజినెస్ ఏజన్సీస్, సాధనలు, విజయాలు, సొసైటీలో గుర్తింపు సాధించగలరు. మీ సమయాన్ని క్రియేటివ్​గా, సరదాగా గడపుతారు. మీరు కోల్పోయిన వైభవాన్ని తిరిగి సాధించగలరని ఫలితాలు చెబుతున్నాయి. ఆరోగ్యం అద్భుతంగా ఉంటుంది. అన్నీ కలిసి గొప్ప రోజు!

కుంభం (Aquarius) :కుంభరాశి వారిని ఈరోజు విజయం వరిస్తుంది. మీ స్టైల్‌, సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. కుటుంబసభ్యులతో గడిపే సమయం మీకు సంతృప్తి, ఆనందాన్ని ఇస్తుంది. ఈ రోజంతా మీరు ఉత్సాహంగా ఉంటారు. మీ మానసికస్థితి ఆలోచనలకు దూరంగా ఉంటుంది.

మీనం (Pisces) : మీన రాశివారికి తారాబలం బలంగా ఉంది. వారు కొత్త అవకాశాలను అందుకుంటారు. రోజువారీ పనులు పక్కనపెట్టండి. సృజనాత్మకంగా మీరు ప్రస్తుతం ఉన్నతస్థితిలో ఉంటారు. ఈ రోజు విద్యార్థులకు శుభసూచకంగా ఉంది.

ABOUT THE AUTHOR

...view details