తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఆ రాశివారు ఆస్తి వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి- లేదంటే ఇబ్బందే! - తెలుగు రాశి ఫలాలు మీన రాశి

Horoscope Today December 25th 2023 : డిసెంబర్​ 25న (సోమవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

Horoscope Today 25 December 2023
Horoscope Today December 25th 2023

By ETV Bharat Telugu Team

Published : Dec 25, 2023, 4:49 AM IST

Horoscope Today December 25th 2023 : డిసెంబర్​ 25న (సోమవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

మేషం (Aries) :ఈ రోజు మేష రాశివారికి మిశ్రమ ఫలితాలు లభిస్తాయి. ఆస్తులకు సంబంధించిన వ్యవహారాల పట్ల ఆందోళన చెందుతారు. కానీ వైవాహిక జీవితం బాగుంటుంది. ప్రేమ వ్యవహారాలు పురోగమిస్తాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించాలి.

వృషభం (Taurus) :ఈ రోజు వృషభ రాశివారికి అదృష్టం కలిసి వస్తుంది. తారాబలం బాగుండడం వల్ల పనులు అన్నీ విజయవంతంగా పూర్తి చేస్తారు. వ్యాపార, వ్యవహారాల్లో మంచి లాభాలు సంపాదిస్తారు. బంధు, మిత్రులతో సంతోషంగా గడుపుతారు. ఆరోగ్యం బాగుంటుంది.

మిథునం (Gemini) :ఈ రోజు మిథున రాశివారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఘర్షణలకు దూరంగా ఉండాలి. సమయానుకూలంగా నడుచుకోవాలి. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. అనారోగ్య సూచనలు కనిపిస్తున్నాయి. ఖర్చులు పెరుగుతాయి. స్నేహితులతో అనవసర వివాదాలు ఏర్పడవచ్చు. జాగ్రత్త వహించాలి.

కర్కాటకం (Cancer) :ఈ రోజు కర్కాటక రాశివారి తారాబలం చాలా బాగుంది. వ్యాపారంలో మంచి లాభాలు సంపాదిస్తారు. మీ పాత స్నేహితులను కలుసుకుని, సంతోషాన్ని వెలిబుచ్చుతారు. పెళ్లికాని యువతీ, యువకులకు వివాహ సంబంధాలు కుదురుతాయి.

సింహం (Leo) : ఈ రోజు సింహ రాశివారు సానుకూల ఆలోచనలతో ముందడు వేయాలి. అప్పుడే సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుంది. తండ్రి మూలంగా మీరు ఆర్థికంగా లాభపడతారు. ఆస్తికి, భూమికి సంబంధించిన వ్యవహారాల్లో మీకు అనుకూలమైన ఫలితాలు కలుగుతాయి.

కన్య (Virgo) :ఈ రోజు కన్య రాశివారికి కాస్త కష్టంగా గడుస్తుంది. రోజంతా అనేక ఎదురుదెబ్బలు తగులుతాయి. పిల్లల ఆరోగ్యం మిమ్మల్ని ఆందోళనకు గురిచేస్తుంది. పై అధికారులతో వ్యవహరించేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలి. ప్రత్యర్థుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. లేకుంటే ఇబ్బందులు తప్పవు.

తుల (Libra) :ఈ రోజు తుల రాశివారు చాలా ఆచితూచి వ్యవహరించాలి. అనవసర వివాదాలు, వాదనల్లోకి తల దూర్చకూడదు. కోపాన్ని, ఆవేశాన్ని అదుపులో ఉంచుకోవాలి. మాటలు అదుపులో పెట్టుకోవాలి. అయితే ఇవాళ మీకు ఆర్థిక లాభాలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఆధ్యాత్మిక విషయాలపై మనస్సు కేంద్రీకరించడం మంచిది.

వృశ్చికం (Scorpio) :ఈ రోజు వృశ్చిక రాశివారికి అద్భుతంగా ఉంటుంది. స్నేహితులతో కలిసి విలాసవంతంగా గడుపుతారు. కొత్త దుస్తులు కొనుగోలు చేస్తారు. ఒక ప్రణాళిక ప్రకారం, పనులన్నింటినీ విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆర్థికంగా లాభపడతారు. సంఘంలో మంచి గుర్తింపు తెచ్చుకుంటారు.

ధనుస్సు (Sagittarius) : ఈ రోజు ధనుస్సు రాశివారికి శుభ ఫలితాలు లభిస్తాయి. ఆరోగ్యం, సంపద, సంతోషం, అదృష్టం అన్నీ కలిసివస్తాయి. ఇంట్లో సుఖ, శాంతులు వెల్లివిరుస్తాయి. సహోద్యోగుల నుంచి పూర్తి సహకారం లభిస్తుంది. ఆరోగ్యం బాగుంటుంది.

మకరం (Capricorn) : ఈ రోజు మకర రాశివారికి చిన్న చిన్న సమస్యలు ఏర్పడతాయి. పిల్లలకు, తల్లిదండ్రులకు ఆరోగ్య సంబంధమైన సమస్యలు వస్తాయి. సరైన నిర్ణయాలు తీసుకోలేక ఇబ్బంది పడతారు. పోటీదారులతో, తోటివారితో వాదనలకు దిగకపోవడం మంచిది.

కుంభం (Aquarius) :ఈ రోజు కుంభ రాశివారికి మిశ్రమ ఫలితాలు కలుగుతాయి. విద్యార్థులు చదువుల్లో రాణిస్తారు. ఆడవారు సౌందర్య సామగ్రి కొనుగోలు చేస్తారు. ఖర్చులు బాగా పెరుగుతాయి. ఆస్తి వ్యవహారాాల్లో చాాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ విషయాన్నైనా పరిణిితితో ఆలోచించి చేయాలి.

మీనం (Pisces) : ఈ రోజు మీన రాశివారు చాలా జాగ్రత్తగా ఉండాలి. కీలకమైన నిర్ణయాలు ఇవాళ తీసుకోకపోవడం చాలా మంచిది. మీలోని సృజనాత్మకతను వెలికి తీయండి. త్వరలోనే మీరు విజయపథంలోకి దూసుకుపోతారు. జీవిత భాగస్వామి మీకు తోడుగా నిలుస్తారు.

ABOUT THE AUTHOR

...view details