తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Horoscope Today (03-11-2021): నేటి మీ రాశిఫలం, గ్రహబలం తెలుసుకోండి..

ఈ రోజు రాశిఫలాలు(Horoscope Today) గురించి డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే..

రాశిఫలం
Horoscope Today

By

Published : Nov 3, 2021, 4:25 AM IST

ఈరోజు(3-11-2021) గ్రహ బలం, శుభముహూర్తంతో పాటు.. పన్నెండు రాశుల (Horoscope Today) వారి సమయం ఎలా ఉందో తెలుసుకోండి..

శ్రీ ప్లవనామ సంవత్సరం; దక్షిణాయనం శరదృతువు; ఆశ్వయుజ మాసం; బహుళపక్షం

త్రయోదశి:ఉ.7.09 తదుపరి చతుర్దశితె. 5.24

హస్త:ఉ. 9.08 తదుపరి చిత్త

వర్జ్యం:సా. 4.48 నుంచి 6.19 వరకు

అమృత ఘడియలు: రా.2.00 నుంచి 3.32 వరకు

దుర్ముహూర్తం:ఉ. 11.21 నుంచి 12.07 వరకు

రాహుకాలం:మ.12.00 నుంచి 1.30 వరకు

సూర్యోదయం:ఉ.6.03, సూర్యాస్తమయం: సా.5-26

మాస శివరాత్రి, నరక చతుర్దశి

మేషం

మంచి ఫలితాలు సిద్ధిస్తాయి. కాలాన్ని సద్వినియోగం చేసుకోండి. మనోధైర్యంతో చేసే పనులు సిద్ధిస్తాయి. మనోవిచారం కలిగించే సంఘటనలకు దూరంగా ఉండాలి. గురుశ్లోకం చదవాలి.

వృషభం

సమయానుకూలంగా ముందుకు సాగాలి. ఆలోచనలే పెట్టుబడిగా లాభాలను అందుకుంటారు. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. ఇష్టదైవ సందర్శనం వల్ల మంచి జరుగుతుంది.

మిథునం

శ్రమ కాస్త పెరుగుతుంది. మితంగా ఖర్చు చేయాలి. కుటుంబసభ్యులతో ప్రేమగా మెలగాలి. ప్రయాణాల్లో అప్రమత్తంగా ఉండాలి. సమయానికి మంచి భోజనం తీసుకోవాలి. నవగ్రహ శ్లోకం చదవాలి.

కర్కాటకం

మనస్సౌఖ్యం ఉంది. మీ మీ రంగాల్లో మంచి పేరు సంపాదిస్తారు. ఒక శుభవార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. స్థానచలన సూచనలు ఉన్నాయి. ఆర్థికంగా ఎదుగుతారు. దుర్గాస్తుతిని పఠిస్తే బాగుంటుంది.

సింహం

శుభ సమయం. కీలక వ్యవహారాల్లో సమయస్ఫూర్తితో వ్యవహరించి అందరి ప్రశంసలను అందుకుంటారు. మీ మీ రంగాల్లో స్పష్టమైన ఆలోచనలతో ముందుకు సాగి మంచి ఫలితాలు సాధిస్తారు. ఇష్టదైవ ధ్యానం శుభప్రదం.

కన్య

తోటివారి సహాయ సహకారాలు ఉన్నాయి. ధనలాభం కలదు. శత్రువులు తగ్గుతారు. అభివృద్ధికి తోడ్పడే నిర్ణయాలు తీసుకునేటప్పుడు స్థిరచిత్తంతో వ్యవహరిస్తే శుభం చేకూరుతుంది. ప్రయాణ అనుకూలత ఉంది. కులదైవారాధన శుభప్రదం.

తుల

ప్రారంభించిన పనులలో చిన్న చిన్న ఆటంకాలు ఎదురైనప్పటికీ అధిగమిస్తారు.అలసట పెరుగుతుంది. బంధుమిత్రులతో ఆచితూచి వ్యవహరించాలి. ఒక సంఘటన మనస్తాపాన్ని కలిగిస్తుంది. మహాలక్ష్మి ధ్యానం శుభప్రదం.

వృశ్చికం

మీ మీ రంగాల్లో సత్ఫలితాలు సాధిస్తారు. విజయావకాశాలు మెరుగవుతాయి. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. పెద్దల ఆశీర్వచనాలు ఉంటాయి. ప్రయాణాలు ఫలిస్తాయి. ఇష్టదైవారాధన శుభప్రదం.

ధనుస్సు

స్థిరమైన ఫలితాలను అందుకుంటారు. కుటుంబసభ్యులతో ఆనందంగా గడుపుతారు. భోజన సౌఖ్యం కలదు. మనస్సౌఖ్యం ఉంది. ఆర్థికంగా శుభకాలం. గాయత్రీ మంత్రాన్ని జపించాలి.

మకరం

ప్రారంభించబోయే పనుల్లో అలసట చెందకుండా చూసుకోవాలి. బంధుమిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. కొన్ని సందర్భాల్లో లౌక్యంగా వ్యవహరించి సమస్యలను అధిగమిస్తారు. నలుగురికీ ఉపయోగపడే పనులను చేసి తోటి వారి ప్రశంసలను అందుకుంటారు. గణపతి మంత్రం చదివితే మంచిది.

కుంభం

మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. ఆశించిన ఫలితాలను రాబట్టడానికి ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. సమయపాలన పాటించండి. బలమైన ఆహారం,విశ్రాంతి అవసరం అవుతాయి. ప్రయాణాలలో ముందుచూపుతో వ్యవహరించాలి. శ్రీరామ నామాన్ని జపించండి.

మీనం

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాల్లో శుభఫలితాలు ఉన్నాయి. నిర్ణీత సమయంలో పనులను పూర్తిచేస్తారు. సొంతింటి నిర్మాణ వ్యవహారానికి సంబంధించి ఒక ముందడుగు వేస్తారు. కొన్ని సంఘటనలు బాధ కలిగించినా చలించకుండా దృఢంగా ఉంటారు. కలహాలకు దూరంగా ఉండాలి. ఇష్టదైవారాధన వల్ల మంచి జరుగుతుంది.

ఇదీ చూడండి:Weekly Horoscope: ఈ వారం రాశిఫలం (అక్టోబరు 31 - నవంబర్​ 06)

ABOUT THE AUTHOR

...view details