Horoscope Today (09-05-2022): నేటి మీ రాశిఫలం, గ్రహబలం తెలుసుకోండి.. - ఈనాడు రాశిఫలాలు
Horoscope Today (09-05-2022): ఈ రోజు రాశిఫలాల గురించి డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే..
horoscope
By
Published : May 9, 2022, 3:38 AM IST
Horoscope Today(09-05-2022): ఈ రోజు గ్రహ బలం, శుభముహూర్తంతో పాటు.. పన్నెండు రాశుల వారి సమయం ఎలా ఉందో తెలుసుకోండి.
మనోబలంతో ముందుకు సాగి అనుకున్నది సాధిస్తారు. అవసరానికి తగిన సాయం లభిస్తుంది. బంధుమిత్రులతో కలసి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. భోజన సౌఖ్యం కలదు. ఇష్టదైవారాధన శుభప్రదం.
వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాల్లో ఆశించిన ఫలితాలున్నాయి. ఉత్సాహంగా ముందుకు సాగండి. బంధుమిత్రులతో విభేదాలు వచ్చే సూచనలున్నాయి. ఒక సంఘటన బాధ కలిగిస్తుంది. ఆంజనేయ స్వామిని ఆరాధిస్తే మంచిది.
మధ్యమ ఫలితాలున్నాయి. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. బుద్ధిబలంతో వ్యవహరిస్తే సరిపోతుంది. చిన్నపాటి సమస్యలు ఉన్నప్పటికీ మీ బుద్ధిబలంతో వాటిని అధిగమిస్తారు. సూర్యాష్టకం చదివితే శుభదాయకం.
శుభ ఫలితాలున్నాయి. బుద్ధిబలంతో అందరినీ ఆకట్టుకుంటారు. కుటుంబ అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. మానసికంగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు. ఇష్టదైవారాధన శుభానిస్తుంది.
ప్రయత్నకార్యసిద్ధి ఉంది. భోజన సౌఖ్యం కలదు. ఇబ్బంది పెట్టాలని చూసేవారున్నారు జాగ్రత్త. మొహమాటంతో ఖర్చులు పెరుగుతాయి. ఈశ్వర ధ్యానం ఉత్తమం.
అదృష్ట ఫలితాలున్నాయి. మీ మీ రంగాల్లో అంతా మంచే జరుగుతుంది. కొన్ని వ్యవహారాల్లో ధైర్యంగా వ్యవహరించి అందరి ప్రశంసలు అందుకుంటారు. శివారాధన మంచిది.
శారీరక శ్రమ పెరుగుతుంది. చేయని పొరపాటుకు నిందపడాల్సి వస్తుంది. మనోధైర్యాన్ని కోల్పొవద్దు. బంధువులతో వాదనకు దిగడం ద్వారా విభేదాలు వచ్చే సూచనలు ఉన్నాయి. నవగ్రహ స్తోత్రం పారాయణ చేస్తే శుభం కలుగుతుంది.
ఒక ముఖ్యమైన సమస్య పరిష్కారమవుతుంది. ఇష్టమైనవారితో కాలాన్ని గడుపుతారు. వ్యాపారంలో అనుకూల ఫలితాలున్నాయి. చిత్తసౌఖ్యం ఉంది. ఇష్టదైవ స్తుతి శుభప్రదం.
తలపెట్టిన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. దైవారాదన ఎట్టి పరిస్థితుల్లోనూ మానవద్దు.
కీలక వ్యవహారాల్లో అధికారుల ప్రశంసలు లభిస్తాయి. మీ కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. బంధుమిత్రుల ద్వారా మేలు జరుగుతుంది. సుబ్రహ్మణ్య అష్టోత్తర శతనామావళి పఠిస్తే బాగుంటుంది.
శుభ కాలం. కొన్ని వ్యవహారాల్లో స్థిరమైన బుద్ధితో వ్యవహరించి మంచి ఫలితాలను పొందుతారు. వ్యాపారంలో లాభదాయకమైన ఫలితాలుంటాయి. సకాలంలో సహాయం చేసేవారున్నారు. శివారాధన చేస్తే మంచిది.
శ్రమకు తగిన ఫలితాలుంటాయి. మనశ్శాంతి తగ్గకుండా చూసుకోవాలి. బంధుమిత్రులతో కలసి ఆనందంగా గడుపుతారు. ముఖ్యమైన పనులు త్వరగా పూర్తయ్యేలా ప్రణాళికను సిద్ధం చేయండి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. ఆదిత్య హృదయం పఠిస్తే మంచిది.