తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Horoscope Today (16-03-2022): నేటి మీ రాశిఫలం, గ్రహబలం తెలుసుకోండి.. - గ్రహం అనుగ్రహం

Horoscope Today (16-03-2022): ఈ రోజు రాశిఫలాల గురించి డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే..

horoscope
రాశిఫలాలు

By

Published : Mar 16, 2022, 4:06 AM IST

Horoscope Today (16-03-2022): ఈరోజు గ్రహ బలం, శుభముహూర్తంతో పాటు.. పన్నెండు రాశుల వారి సమయం ఎలా ఉందో తెలుసుకోండి.

శ్రీ ప్లవ నామ సంవత్సరం; ఉత్తరాయణం శిశిర రుతువు;

ఫాల్గుణ మాసం; శుక్ల పక్షం

త్రయోదశి: మ. 12.47 తదుపరి చతుర్దశి

మఘ: రా. 11.53 తదుపరి పుబ్బ

వర్జ్యం: ఉ.11.14 నుంచి 12.55 వరకు అమృత ఘడియలు: రా.9.21 నుంచి 11.02 వరకు

దుర్ముహూర్తం: మ.11.45 నుంచి 12.32 వరకు

రాహుకాలం: మ.1.30 నుంచి 3.00 వరకు

సూర్యోదయం: ఉ.6.14, సూర్యాస్తమయం: సా.6.06

కామ దహనం

మేషం

మొదలుపెట్టిన పనుల్లో చిత్తశుద్ధి అవసరం. పూర్వపుణ్యం రక్షిస్తోంది. ముఖ్య విషయాల్లో చంచల స్వభావాన్ని రానీయకండి. కొందరి ప్రవర్తన మిమ్మల్ని నిరుత్సాహపరుస్తుంది. ఇష్టదైవారాధన శుభప్రదం.

వృషభం

మీ మీ రంగాల్లో శ్రమ పెరగకుండా చూసుకోవాలి. కొన్ని కీలక పనులను పూర్తిచేయగలుగుతారు. అధికారులు మీకు అనుకూలమైన ఒక నిర్ణయాన్ని తీసుకుంటారు. ఉమామహేశ్వర స్తోత్రం చదివితే మంచిది.

మిథునం

శుభకాలం. ఏ పని ప్రారంభించినా త్వరగా పూర్తవుతుంది. వ్యాపారంలో లాభాలు ఉన్నాయి. బంధు,మిత్రుల ఆదరాభిమానాలు ఉంటాయి. ఉల్లాసభరితమైన వాతావరణం నెలకొంటుంది. ఆధ్యాత్మికంగా శుభకాలం. శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనం శుభప్రదం.

కర్కాటకం

మిత్రుల సహకారం ఉంటుంది. కుటుంబ సభ్యుల అంగీకారం తర్వాతే నూతన కార్యక్రమాలను ప్రారంభించండి. బద్ధకాన్ని దరిచేరనీయకండి. గిట్టనివారితో జాగ్రత్తగా వ్యవహరించాలి. శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనం శుభప్రదం.

సింహం

ముందస్తు ప్రణాళికలతో మంచి ఫలితాలను సాధిస్తారు. కుటుంబసభ్యుల సహకారంతో నూతన కార్యక్రమాలను చేపడతారు. వ్యాపారంలో అనూహ్య లాభం పొందుతారు. మీ కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. శ్రీలక్ష్మీదేవిని ఆరాధిస్తే బాగుంటుంది.\

కన్య

ప్రారంభించిన పనులలో ఆటంకాలు తప్పవు. ఉత్సాహంగా ముందుకు సాగితే అనుకున్నది సొంతం అవుతుంది. అనవసరంగా ఆందోళనపడటం తగ్గించుకుంటే మంచిది. శివపంచాక్షరీ స్తోత్రం చదివితే మంచిది.

తుల

అనుకూలమైన సమయం. మిత్రులు, బంధువులు మీ మాటకు విలువ ఇస్తారు. మీరు ఆశించిన ఆర్థిక ఫలితాలు వస్తాయి. మానసికంగా దృఢంగా ఉంటారు. లక్ష్మీ అష్టోత్తర శతనామావళి చదివితే బాగుంటుంది.

వృశ్చికం

కష్టానికి తగ్గ ప్రతిఫలం ఉంటుంది. బంధు,మిత్రుల సహకారం ఉంటుంది. ఒక వార్త ఉత్సాహాన్ని ఇస్తుంది. ఖర్చులు చేయిదాటకుండా చూసుకోవాలి. శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. కనకదుర్గాదేవి సందర్శనం శుభప్రదం.

ధనస్సు

ప్రారంభించబోయే పనిలో శ్రమ పెరగకుండా చూసుకోవాలి. ఉత్సాహంగా ముందుకు సాగాలి. బంధువులతో మాట పట్టింపులకు పోవద్దు. హనుమాన్ చాలీసా చదవడం వల్ల మంచి ఫలితాలు పొందగలుగుతారు.

మకరం

వృత్తి,ఉద్యోగ,వ్యాపారాలలో అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. మానసిక ప్రశాంతత తగ్గకుండా చూసుకోవాలి. ఈశ్వర సందర్శనం ఉత్తమం.

కుంభం

ప్రారంభించిన పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తి చేసే ప్రయత్నం చేస్తారు. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. ఒక వ్యవహారంలో మీ ముందుచూపు, వ్యవహారశైలికీ ప్రశంసలు లభిస్తాయి. సూర్యుడిని ఆరాధిస్తే మంచిది.

మీనం

అనుకూల సమయం. అభివృద్ధి కోసం తీసుకునే నిర్ణయాలు లాభాన్ని చేకూరుస్తాయి. మీ కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. అవసరానికి తగిన సహాయం అందుతుంది. గోవిందనామాలు చదవడం ఉత్తమం.

ABOUT THE AUTHOR

...view details