తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Horoscope Today ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (13-01-2022) - ఈనాడు రాశిఫలాలు

Horoscope Today: ఈ రోజు రాశిఫలాల గురించి డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే..

Horoscope Today
రాశిఫలాలు

By

Published : Jan 13, 2022, 4:39 AM IST

Horoscope Today: ఈరోజు (13-01-2022) గ్రహ బలం, శుభముహూర్తంతో పాటు.. పన్నెండు రాశుల వారి సమయం ఎలా ఉందో తెలుసుకోండి.

శ్రీ ప్లవ నామ సంవత్సరం; దక్షిణాయనం హేమంత రుతువు; పుష్య మాసం;

శుక్ల పక్షం ఏకాదశి: రా. 8.21 తదుపరి ద్వాదశి కృత్తిక: సా. 6.24 తదుపరి రోహిణి

వర్జ్యం: ఉ.శే.వ. 7.02 వరకు

అమృత ఘడియలు: మ.3.47 నుంచి 5.31 వరకు

దుర్ముహూర్తం: ఉ.10.18 నుంచి 11.02 వరకు తిరిగి మ.2.42 నుంచి 3.26 వరకు

రాహుకాలం: మ. 1.30 నుంచి 3.00 వరకు

సూర్యోదయం: ఉ.6.38, సూర్యాస్తమయం: సా.5-39

మేషం

మనోధైర్యంతో చేసే పనులు సిద్ధిస్తాయి. కొన్ని సంఘటనలు మిమ్మల్ని కాస్త నిరుత్సాహపరుస్తాయి. అనవసర ఖర్చులు పెరిగే సూచనలు ఉన్నాయి. లక్ష్మీఆరాధన, కనకధారాస్తవం చదవాలి.

వృషభం

శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగి పనులను పూర్తి చేస్తారు. శత్రువులపై మీరే విజయం సాధిస్తారు. సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధించాలి.

మిథునం

దైవబలం సంపూర్ణంగా రక్షిస్తుంది. శ్రమ పెరిగినప్పటికీ మంచి చేకూరుతుంది. గొప్పవారితో పరిచయం ఏర్పడుతుంది. సమాజంలో మంచిపేరు దక్కుతుంది. సూర్యనారాయణమూర్తి ఆరాధన శుభదాయకం.

కర్కాటకం

ఆశించిన ఫలితాలు వస్తాయి. బంధువుల సహకారం ఉంటుంది. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. కొన్ని ముఖ్యమైన పనులలో పురోగతి ఉంటుంది. దైవారాధన మానవద్దు.

సింహం

అర్థలాభం ఉంటుంది. ధర్మసిద్ధి కలదు. బంధువులతో ఆనందాన్ని పంచుకుంటారు. మనఃసౌఖ్యం కలదు. ఇష్ట దైవారాధన శుభప్రదం.

కన్య

మధ్యమ ఫలాలు ఉన్నాయి. మానసికంగా దృఢంగా ఉంటారు. అవసరానికి సాయం చేయడానికి కొందరు ముందుకు వస్తారు. విరోధులను తక్కువగా అంచనా వేయవద్దు. హనుమాన్ చాలీసా చదవాలి.

తుల

ప్రారంభించబోయే పనుల్లో గొప్ప ఫలితాలు సాధిస్తారు. సంతోషాన్ని పొందుతారు. శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. విష్ణు సహస్రనామాలు చదివితే మంచి జరుగుతుంది.

వృశ్చికం

ఉత్సాహంగా పనిచేస్తారు. బంధువుల సహకారం లభిస్తుంది. ప్రతీ విషయాన్ని కుటుంబంతో చర్చించి ప్రారంభించాలి. లక్ష్మీ సహస్రనామం చదివితే మంచి జరుగుతుంది.

ధనుస్సు

అనుకూల ఫలితాలు ఉన్నాయి. ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. బంధుమిత్రులతో కలిసి చేసే పనులు సత్ఫలితాన్ని ఇస్తాయి. ఒక ముఖ్య వ్యవహారంలో మీరు ఆశించిన పురోగతి ఉంటుంది. ఆదిత్య హృదయం చదవాలి.

మకరం

వృత్తి, ఉద్యోగాల్లో శ్రమతో కూడిన ఫలితాలు ఉన్నాయి. తోటివారి సహకారంతో అనుకున్న ఫలితాలు సిద్ధిస్తాయి. అనవసర విషయాల గురించి సమయాన్ని వృథా చేయకండి. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. శ్రీరామనామాన్ని జపించడం ఉత్తమం.

కుంభం

కీలక వ్యవహారాల్లో సమాచారలోపం లేకుండా చూసుకోవాలి. వృత్తి,ఉద్యోగ, వ్యాపారాలలో శ్రమకు తగిన ఫలితం సిద్ధిస్తుంది. ఎన్ని ఆటంకాలు ఎదురైనా మనోబలంతో ముందుకు సాగండి. అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి. శ్రమ పెరుగుతుంది. ఎవరితోనూ వాదోపవాదాలు చేయవద్దు. ఇష్టదైవ ప్రార్థన మంచిది.

మీనం

అనుకూల సమయం. తోటి వారి సహాయ సహకారాలు అందుతాయి. మీ బుద్ధిబలంతో కీలక సమస్యలను పరిష్కరించి అందరి మన్ననలు పొందుతారు. ప్రయాణాలు ఫలిస్తాయి. గణపతి ఆరాధన చేస్తే మంచిది.

ఇదీ చూడండి:Weekly Horoscope: ఈ వారం రాశిఫలం (జనవరి 09 - జనవరి 15)

ABOUT THE AUTHOR

...view details