Horoscope Today (21-02-2022): ఈరోజు పన్నెండు రాశుల వారి సమయం ఎలా ఉందో తెలుసుకోండి.
మేషం
శుభకాలం. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో అభివృద్ధికి సంబందించిన వార్త వింటారు. ఒక వార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. బంధుమిత్రులతో కలిసి శుభకార్యక్రమాలలో పాల్గొంటారు. కొన్ని సంఘటనలు మిమ్మల్ని ఉత్సాహపరుస్తాయి. కనకధారాస్తవం పఠించాలి.
వృషభం
శ్రమతో కూడిన ఫలితాలున్నాయి. పక్కవారిని కలుపుకుపోవడం వల్ల ఇబ్బందులు తగ్గుతాయి. మనోబలం తగ్గకుండా చుచుకోవాలి. చంద్రధ్యాన శ్లోకం చదివితే మంచి జరుగుతుంది.
మిథునం
భవిష్యత్ ప్రణాళికలో స్పష్టత వస్తుంది. తోటివారితో కలిసి శుభకార్యాలలో పాల్గొంటారు. ఆదాయానికి తగ్గ వ్యయం ఉంది. ప్రయాణాలు ఫలిస్తాయి. శివ నామస్మరణ ఉత్తమం.
కర్కాటకం
కృషికి తగ్గ ఫలితలున్నాయి. కీలక వ్యవహారాల్లో కుటుంబ సహకారం అందుతుంది. బంధుప్రీతి కలదు. ఈశ్వర సందర్శనం శుభప్రదం.
సింహం
మంచి పనులు చేపడతారు. గొప్ప వారితో సత్సాంగత్యం ఏర్పడుతుంది. కీలక విషయాల్లో పురోగతి ఉంటుంది. ఆంజనేయ ఆరాధన శుభప్రదం.
కన్య
మానసిక ప్రశాంతత ఉంటుంది. తలపెట్టిన పనిలో ఆత్మీయుల సహకారం అందుతుంది. బంధువులతో మేలు జరుగుతుంది. ఆధ్యాత్మిక విషయాల్లో చురుగ్గా పాల్గొంటారు. చంద్రశేఖరాష్టకం శుభప్రదం.
తుల
బుద్ధిబలం బాగుంటుంది. సందర్భోచితంగా కీలక నిర్ణయాలు తీసుకుంటారు. చెప్పుడు మాటలను వినకండి. ప్రయాణాలలో ఆటంకాలు ఉంటాయి. సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధిస్తే మంచిది.
వృశ్చికం
చేపట్టిన పపనులలో కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి. శారీరక శ్రమ పెరుగుతుంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల తరువాత ఇబ్బందులు పడతారు. సుబ్రహ్మణ్య భుజంగాస్తవం చదివితే మంచి ఫలితాలు కలుగుతాయి.
ధనస్సు
అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. నూతన వస్తువులు కొంటారు. అవసరానికి తగిన సహాయం అందుతుంది. మీ కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. ఇష్టదైవాన్ని దర్శిస్తే మంచి జరుగుతుంది.
మకరం
మిశ్రమ కాలం. కష్టాన్ని నమ్ముకొని ముందుకు సాగండి తిరుగులేని ఫలితాలను అందుకుంటారు. ఒకట్రెండు ఆటంకాలు ఎదురైనా పెద్దగా ఇబ్బంది చేయవు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. చంద్రధ్యానం శుభప్రదం.
కుంభం
మీ అభివృద్ధికి దోహదపడే ఒక కీలక నిర్ణయాన్ని తీసుకుంటారు. తరచూ నిర్ణయాలు మారుస్తూ ఇబ్బందులు పడతారు. స్థిరమైన బుద్ధితో ముందుకు సాగండి. కుటుంబములో సమస్యలు రాకుండా జాగ్రత్తపడాలి. దుర్గ అష్టోత్తరం చదవడం మంచిది.
మీనం
మీ మీ రంగాల్లో విజయావకాశాలు మెరుగవుతాయి. అభివృద్ధికోసం చేసే ఆలోచనలను ఆచరణలో పెట్టి సత్ఫలితాలు సాధిస్తారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. పెద్దల ఆశీర్వచనాలుంటాయి. ప్రయాణాలు ఫలిస్తాయి. ఇష్టదైవారాధన శుభప్రదం.
ఇదీ చూడండి:Weekly Horoscope: ఈ వారం రాశిఫలం (ఫిబ్రవరి 20 - ఫిబ్రవరి 26)