తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Horoscope Today (17-02-2022): నేటి మీ రాశిఫలం, గ్రహబలం తెలుసుకోండి.. - తెలుగు జాతకం

Horoscope Today (17-02-2022): ఈ రోజు రాశిఫలాల గురించి డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే..

horoscope today
రాశి ఫలాలు

By

Published : Feb 17, 2022, 4:05 AM IST

Horoscope Today (17-02-2022): ఈరోజు గ్రహ బలం, శుభముహూర్తంతో పాటు.. పన్నెండు రాశుల వారి సమయం ఎలా ఉందో తెలుసుకోండి.

శ్రీ ప్లవ నామ సంవత్సరం; ఉత్తరాయణం శిశిర రుతువు;

మాఘ మాసం; బహుళ పక్షం

పాడ్యమి: రా. 10.42 తదుపరి విదియ

మఘ: సా. 4.25 తదుపరి పుబ్బ

వర్జ్యం: రా. 12.39 నుంచి 2.17 వరకు

అమృత ఘడియలు: మ.1.54 నుంచి 3.34 వరకు

దుర్ముహూర్తం: ఉ.10.19 నుంచి 11.04 వరకు తిరిగి మ.2.53 నుంచి 3.39 వరకు

రాహుకాలం: మ. 1.30 నుంచి 3.00 వరకు

సూర్యోదయం: ఉ.6.30, సూర్యాస్తమయం: సా.5.57

మేషం

ముఖ్యవిషయాల్లో అనుభవజ్ఞుల సలహాలు అవసరం అవుతాయి. శత్రువుల జోలికి పోకుండా ఉండటం మంచిది. ఒక వార్త బాధను కలిగిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. గణపతి దర్శనం శుభప్రదం.

వృషభం

ఒక పనిలో మీకు అధికారుల ప్రశంసలు లభిస్తాయి. ఎవరితోనూ విభేదించకండి. మాట విలువను కాపాడుకోవాలి. ఎప్పటి నుంచో ఇబ్బంది పెడుతున్న కొన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. శ్రీరామ నామస్మరణ మేలు చేస్తుంది.

మిథునం

అర్థలాభం ఉంది. ఇష్టమైన వారితో కాలాన్ని గడుపుతారు. కుటుంబ చిక్కులు ఇబ్బంది పెడతాయి. రుణ సమస్యలు పెరగకుండా ముందుచూపుతో వ్యవహరించాలి. శ్రీసుబ్రహ్మణ్య స్వామి సందర్శనం మేలు చేస్తుంది.

కర్కాటకం

ఒక వ్యవహారంలో మీకు కుటుంబసభ్యుల సహకారం లభిస్తుంది. ఉద్యోగంలో ఇబ్బందులు ఎదురవకుండా చూసుకోవాలి. అనవసర ఖర్చులు తప్పకపోవచ్చు. ప్రయాణాలలో అప్రమత్తంగా ఉండాలి. రాహు శ్లోకం చదవడం మంచిది.

సింహం

శుభకాలం. అనుకున్న పనులను పూర్తిచేస్తారు. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. ధార్మిక, సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. స్థిరాస్తి కొనుగోళ్లు లాభిస్తాయి. విందు,వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇష్టదేవతా శ్లోకాన్ని చదివితే మంచిది.

కన్య

ప్రారంభించిన పనులలో శ్రమ పెరగకుండా చూసుకోవాలి. కొన్ని సంఘటనలు మనోవిచారాన్ని కలిగిస్తాయి. బంధువులతో విభేదాలు వచ్చే సూచనలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. దుర్గాదేవిని ఆరాధించాలి.

తుల

ప్రారంభించే పనుల్లో సంతృప్తికర ఫలితాలను సాధిస్తారు. మానసికంగా సంతోషాన్ని పొందుతారు. శుభకార్యక్రమాలలో పాల్గొంటారు. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. విష్ణు సహస్ర నామాలు చదివితే మంచి జరుగుతుంది.

వృశ్చికం

ఉత్సాహంగా పనిచేస్తారు. బంధువుల సహకారం ఉంటుంది. ప్రతి విషయాన్ని కుటుంబంతో చర్చించి మొదలుపెట్టాలి. లక్ష్మీసహస్రనామం చదివితే మంచి జరుగుతుంది.

ధనస్సు

మీలోని పోరాట పటిమ మిమ్మల్ని గొప్పవారిని చేస్తుంది. అధికారులు మీపట్ల మిశ్రమ వైఖరితో ఉంటారు. కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుని భవిష్యత్ ప్రణాళికలు వేస్తారు. శ్రీ వేంకటేశ్వర దర్శనం శుభప్రదం.

మకరం

ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. ప్రారంభించిన కార్యక్రమాల్లో మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. అవసరానికి తగిన సహాయం అందుతుంది. సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధించాలి.

కుంభం

ఒక శుభవార్త మీ ఇంట్లో సంతోషాన్ని నింపుతుంది. కొన్ని వ్యవహారాలలో ధైర్యంగా వ్యవహరించి అందరి ప్రశంసలు అందుకుంటారు. కొన్ని విషయాల్లో ఊహించిన దాని కన్నా ఎక్కువ ఫలితాలు ఉంటాయి. ఇష్ట దేవతారాధన శుభప్రదం.

మీనం

వృత్తి,ఉద్యోగ,వ్యాపారాలలో అనుకూల సమయం. అధికారులు మీ పనితీరుకు ప్రశంసలు కురిపిస్తారు. విందు, వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. తోటివారి సహకారంతో ఒక ముఖ్య వ్యవహారంలో కీలక నిర్ణయం తీసుకుంటారు. శ్రీ రామ నామాన్ని జపించాలి.

ఇదీ చూడండి :Weekly Horoscope: ఈ వారం రాశిఫలం (ఫిబ్రవరి 13 - 20)

ABOUT THE AUTHOR

...view details