తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Horoscope Today (14-02-2022): నేటి మీ రాశిఫలం, గ్రహబలం తెలుసుకోండి.. - గ్రహం అనుగ్రహం

Horoscope Today (14-02-2022): ఈ రోజు రాశిఫలాల గురించి డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే..

Horoscope Today
రాశిఫలం, గ్రహబలం తెలుసుకోండి..

By

Published : Feb 14, 2022, 4:28 AM IST

Horoscope Today (14-02-2022): ఈరోజు గ్రహ బలం, శుభముహూర్తంతో పాటు.. పన్నెండు రాశుల వారి సమయం ఎలా ఉందో తెలుసుకోండి.

శ్రీ ప్లవ నామ సంవత్సరం; ఉత్తరాయణం శిశిర రుతువు;

మాఘ మాసం; శుక్ల పక్షం

త్రయోదశి: రా. 7.51 తదుపరి చతుర్దశి

పునర్వసు: ఉ. 11.36 తదుపరి పుష్యమి

వర్జ్యం: రా. 8.17 నుంచి 10.01 వరకు

అమృత ఘడియలు:ఉ.8.58 నుంచి 10.43 వరకు; దుర్ముహూర్తం: మ. 12.37 నుంచి 1.23 వరకు తిరిగి 2.54 నుంచి 3.40 వరకు

రాహుకాలం: ఉ.7.30 నుంచి 9.00 వరకు

సూర్యోదయం: ఉ.6.32, సూర్యాస్తమయం: సా.5.57

మేషం

కుటుంబసభ్యుల సహకారం ఉంటుంది. ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. పొదుపు పాటించాలి. స్థానచలనం సూచితం. కీలక వ్యవహారాల్లో మంచి చేకూరుతుంది. శివనామాన్ని జరిపించాలి.

వృషభం

ముఖ్య విషయాల్లో అప్రమత్తంగా వ్యవహరించాలి. బంధువులతో ఆచి తూచి వ్యవహరించాలి. మనః పీడ పెరుగుతుంది. పంచముఖి ఆంజనేయుడిని ఆరాధించడం వలన మంచి ఫలితాలు కలుగుతాయి.

మిథునం

ప్రణాళికలను అమలు చేసే దిశగా ముందుకు సాగండి. బలమైన ఆహారాన్ని తీసుకోవాలి. శత్రువుల జోలికి పోరాదు. వృథా ప్రయాణాల వల్ల నిరుత్సాహం కలుగుతుంది. దుర్గారాధన వల్ల మేలు జరుగుతుంది.

కర్కాటకం

ఉద్యోగంలో పై అధికారులతో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబసభ్యుల మధ్య విభేదాలు రాకుండా జాగ్రత్త పడాలి. మీ నిజాయితీ మిమ్మల్ని కాపాడుతుంది. శివనామాన్ని జపించాలి.

సింహం

విజయావకాశాలు మెరుగవుతాయి. శత్రువులపై మీదే పైచేయి అవుతుంది. ఆర్థిక వ్యవహారాలలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఇష్టదైవ నామస్మరణ మంచిది.

కన్య

సౌభాగ్య సిద్ధి ఉంది. ఆత్మీయుల సలహాలు మేలు చేస్తాయి. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. లాభంలో చంద్రుడు అనుకూల ఫలితాలను ఇస్తున్నారు. మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. ఇష్టదేవత స్తుతి మంచిది.

తుల

శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. పెద్దలనుంచి ప్రోత్సాహకాలను అందుకుంటారు. తోటివారి సహకారంతో పనులు త్వరగా పూర్తవుతాయి. వేంకటేశ్వరుడిని ఆరాధించడం వల్ల శుభ ఫలితాలను పొందగలుగుతారు.

వృశ్చికం

ముఖ్య విషయాల్లో అనుకూల ఫలితాలు వస్తాయి. అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించండి. అనవసరంగా భయాందోళనలకు గురవుతారు. అనవసర ఖర్చులను అదుపు చేయండి. లక్ష్మీ ధ్యానం శుభప్రదం.

ధనుస్సు

అభివృద్ధికి సంబంధించిన వార్త వింటారు. తలపెట్టిన పనులను విజయవంతంగా పూర్తిచేయగలుగుతారు. విందూ వినోద ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. దైవారాదన మానవద్దు. శివారాధన శుభప్రదం.

మకరం

ఒక శుభవార్త ఆనందాన్నిస్తుంది. ప్రక్కనే ఉండి ఇబ్బంది పెట్టేవారున్నారు. విజ్ఞానపరంగా ఎదుగుతారు. ముఖ్యమైన విషయాల్లో ఓర్పు అవసరం. శివనామస్మరణ చేయడం ఉత్తమం.

కుంభం

శరీర సౌఖ్యం ఉంది. ఇష్టకార్యాలు సిద్ధిస్తాయి. యశస్సు వృద్ధి చెందుతుంది. ముఖ్య విషయాల్లో కుటుంబ సహకారం ఉంటుంది. ప్రయాణాలు ఫలిస్తాయి. ఇష్టదైవ ప్రార్ధన మేలు చేస్తుంది.

మీనం

మధ్యమ ఫలితాలున్నాయి. పక్కవారిని కలుపుకొని పోవడం వల్ల ఇబ్బందులు తగ్గుతాయి. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. ఈశ్వర ధ్యాన శ్లోకాలు చదివితే మంచి జరుగుతుంది.

ABOUT THE AUTHOR

...view details