తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Horoscope Today (27-12-2021): ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? - horoscope monday latest news

Horoscope Today (27-12-2021): ఈ రోజు రాశిఫలాల గురించి డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే..

horoscope
రాశిఫలాలు

By

Published : Dec 27, 2021, 4:01 AM IST

Updated : Dec 27, 2021, 6:13 AM IST

Horoscope Today (27-12-2021): ఈరోజు గ్రహ బలం, శుభముహూర్తంతో పాటు.. పన్నెండు రాశుల వారి సమయం ఎలా ఉందో తెలుసుకోండి.

శ్రీ ప్లవ నామ సంవత్సరం, దక్షిణాయనం హేమంత రుతువు

మార్గశిర మాసం, బహుళ పక్షం

అష్టమి:మ. 2.35 తదుపరి నవమి

హస్త: రా. 1.05 తదుపరి చిత్త

వర్జ్యం: ఉ. 9.47 నుంచి 11.21 వరకు

అమృత ఘడియలు:రా.7.12 నుంచి 8.46 వరకు

దుర్ముహూర్తం: మ. 12.22 నుంచి 1.06 వరకు తిరిగి 2.33 నుంచి 3.17 వరకు

రాహుకాలం: ఉ. 7.30 నుంచి 9.00 వరకు

సూర్యోదయం: ఉ.6.32, సూర్యాస్తమయం:సా.5-29

మేషం

మీ మీ రంగాల్లో ముందు చూపుతో వ్యవహరించాలి. తోటివారి సూచనలు ఉపకరిస్తాయి. శారీరక శ్రమ పెరుగుతుంది. ముఖ్య విషయాల్లో కుటుంబసభ్యుల సహకారం తీసుకోవడం మంచిది. శివ ఆరాధన శుభప్రదం.

వృషభం

మిశ్రమ కాలం. ముఖ్యమైన పనులను కొన్నాళ్లు వాయిదా వేసుకోవడమే మంచిది. కొన్ని సంఘటనలు నిరుత్సాహ పరుస్తాయి. ఉద్యోగంలో ఆచితూచి వ్యవహరించాలి. దుర్గాదేవిని వేంకటేశ్వరుడిని పూజిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి.

మిథునం

ఒక సంఘటన మీ మానసిక శక్తిని పెంచుతుంది. మానసిక ప్రశాంతత తగ్గకుండా చూసుకోవాలి. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆరాధన మేలైన ఫలితాలను ఇస్తుంది.

కర్కాటకం

సౌభాగ్యసిద్ధి ఉంది. ఒక ముఖ్యమైన సమస్య పరిష్కారమవుతుంది. సమయానికి సహాయం చేసేవారున్నారు. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. హనుమాన్ చాలీసా చదివితే మంచిది.

సింహం

అధికారులను ప్రసన్నం చేసుకునే విధంగా ముందుకు సాగండి. సమస్యలు క్రమంగా తగ్గుముఖం పడతాయి. తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. మానసిక ప్రశాంతత తగ్గకుండా చూసుకోవాలి. వేంకటేశ్వర స్వామి ఆలయ సందర్శనం శుభప్రదం.

కన్య

మంచి కాలం. మీ పనితీరుతో మీ పై అధికారుల మనసులను గెలుస్తారు. గౌరవ సన్మానాలు అందుకుంటారు. బంధువులతో విబేధాలు వచ్చే సూచనలు ఉన్నాయి. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి. విష్ణు నామస్మరణ చేస్తే మంచిది.

తుల

ఉద్యోగంలో శ్రద్ధగా పనిచేయాలి. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. తెలివితేటలతో ఆలోచించి కొన్ని కీలకమైన పనులను పూర్తి చేయగలుగుతారు. కొన్ని చర్చలు మీకులాభిస్తాయి. లక్ష్మీఅష్టకాన్ని చదవాలి.

వృశ్చికం

ఉత్తమ కాలం. కాలాన్ని అభివృద్ధికై వినియోగించండి. బుద్ధిబలంతో కీలక వ్యవహారం నుంచి బయట పడగలుగుతారు. ఇంట్లో శుభకార్య ప్రసక్తి వస్తుంది. కుటుంబ సౌఖ్యం కలదు. శని ధ్యాన శ్లోకం చదివితే శుభప్రదం.

ధనుస్సు

అప్రమత్తంగా ఉండాల్సిన సమయం. చేపట్టే పనుల్లో అలసట పెరగకుండా ముందుచూపుతో వ్యవహరించాలి. అభిప్రాయబేధాలు రాకుండా చూసుకోవాలి. మొహమాటంతో డబ్బులు ఖర్చు చేయకండి. బంధుమిత్రులతో మాట పట్టింపులకు పోరాదు. విష్ణు నామాన్ని స్మరించాలి.

మకరం

చేపట్టిన పనులలో ఆటంకాలు ఎదురైనా అధిగమించే ప్రయత్నం చేస్తారు. కుటుంబ వాతావరణం అంత అనుకూలంగా ఉండకపోవచ్చు. కొన్ని సంఘటనలు కాస్త మనస్తాపాన్ని కలిగిస్తాయి. శారీరక శ్రమ పెరుగుతుంది. దైవారాధన మానవద్దు

కుంభం

చేపట్టిన పనులలో ఆటంకాలు ఎదురైనా తోటి వారి సహాయంతో వాటిని అధికమిస్తారు. ఒక వార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. బంధుమిత్రులతో కలిసి శుభకార్యక్రమంలో పాల్గొంటారు. ఒక వార్త మిమ్మల్ని ఉత్సాహపరుస్తుంది. ఇష్టదైవారాధన శుభప్రదం.

మీనం

చేపట్టిన పనులలో విజయావకాశాలు ఉన్నాయి. ఆశించిన ఫలితాలున్నాయి. ఒక వ్యవహారంలో సహాయం అందుతుంది. ఒక శుభవార్త మీ మనోవిశ్వాసాన్ని పెంచుతుంది. దైవబలం ఉంది. ఇష్టదైవారాధన శుభప్రదం.

Last Updated : Dec 27, 2021, 6:13 AM IST

ABOUT THE AUTHOR

...view details