నేటి రాశిఫలాల గురించి డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ చెప్పిన సంగతులు మీకోసం..
మేషం
మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. ఒక ముఖ్యమైన విషయమై అధికారులను కలుస్తారు. సమాజంలో మంచిపేరు సంపాదిస్తారు. ఆదాయానికి తగ్గ వ్యయం ఉంది. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. లక్ష్మీ సందర్శనం ఉత్తమం.
వృషభం
మిశ్రమ కాలం. అధికారులు మీ తీరుతో సంతృప్తి పడక పోవచ్చు. అస్థిర నిర్ణయాలతో సతమతమవుతారు. కలహాలకు దూరంగా ఉండాలి. నవగ్రహ శ్లోకాలు చదవాలి.
మిథునం
బుద్ధిబలంతో అందరినీ ఆకట్టుకుంటారు. కుటుంబానికి సంబంధించిన శుభవార్త వింటారు. మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. ఇష్ట దైవారాధన మంచి ఫలితాన్నిస్తుంది.
కర్కాటకం
శుభసమయం. మీ మీ రంగాల్లో ఆశించిన ఫలితాలను రాబడతారు. అదృష్టం వరిస్తుంది. విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఇష్ట దైవారాధన మేలు.
సింహం
అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. ఒక సంఘటన బాధ కలిగిస్తుంది. అనారోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయకండి. ఇష్టదైవాన్ని సందర్శిస్తే మంచి ఫలితం ఉంటుంది.
కన్య
శుభకాలం. చిత్తశుద్ధితో విజయం సాధిస్తారు. స్వధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు రాకుండా జాగ్రత్తపడాలి. అధికారుల కోపానికి గురికాకుండా.. ఓర్పుగా వ్యవహరించండి. శివారాధన వల్ల మంచి జరుగుతుంది.