నేటి రాశిఫలాల గురించి డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ చెప్పిన సంగతులు మీకోసం..
మేషం
మీ మనోధైర్యం మిమ్మల్ని గెలిపిస్తుంది. కొన్ని పరిస్థితులు నిరుత్సాహపరుస్తాయి. కొన్ని వ్యవహారాల్లో చంచల బుద్ధితో వ్యవహరిస్తారు. ఈశ్వర నామస్మరణ ఉత్తమ ఫలితాన్నిస్తుంది.
వృషభం
కీలక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఒక వార్త బాధ కలిగిస్తుంది. ముఖ్య వ్యవహారాల్లో పెద్దల సలహాలు తప్పనిసరి. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. ఇష్ట దైవారాధన మేలు.
మిథునం
కొత్త ఆశయాలతో పనులను ప్రారంభిస్తారు. భవిష్యత్తు కార్యచరణలో స్పష్టత వస్తుంది. తోటివారితో కలిసి శుభకార్యాల్లో పాల్గొంటారు. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి. శివనామస్మరణ శుభప్రదం.
కర్కాటకం
మనసుకు ఉల్లాసం కలిగించే సంఘటనలు చోటుచేసుకుంటాయి. బంధువులతో జాగ్రత్తగా ఉండాలి. ఆర్థికంగా లాభపడతారు. శివుణ్ణి ఆరాధిస్తే మంచిది.
సింహం
బుద్ధిబలం బాగుంటుంది. మీ మీ రంగాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. మనోబలం కొరకు దుర్గాదేవి సందర్శనం శుభప్రదం.
కన్య
అధికారుల సహాయంతో ఒక పనిని పూర్తి చేస్తారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. అవసరానికి ఆర్థిక సాయం అందుతుంది. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించాలి.