తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కూతురు ప్రేమ వివాహం.. కోపంతో వరుడి తండ్రి హత్య - tamil nadu honor killing

Honour Killing: కూతురి ప్రేమ వివాహాన్ని నిరాకరించిన ఓ తండ్రి దారుణానికి పాల్పడ్డాడు. అల్లుడి తండ్రిని హత్య చేశాడు. ఈ ఘటన తమిళనాడులో జరిగింది.

honour killing
honour killing in tamil nadu

By

Published : Mar 5, 2022, 5:39 PM IST

Honour Killing: తమిళనాడులోని మధురైలో దారుణం జరిగింది. కూతురి ప్రేమ పెళ్లిని నిరాకరించిన ఓ తండ్రి.. తన అల్లుడి తండ్రిని హతమార్చాడు.

ఇదీ జరిగింది..

తిడిర్​నగర్​కు చెందిన శివప్రసాద్​ అనే వ్యక్తి అదే ప్రాంతానికి చెందిన ఓ అమ్మాయితో రిలేషన్​షిప్​లో ఉన్నాడు. వారిద్దరూ వేర్వేరు వర్గాలకు చెందినవారు కావడం వల్ల అమ్మాయి తండ్రి వారి పెళ్లికి నిరాకరించాడు. అయినప్పటికీ ఆ జంట మార్చి 4న వివావబంధంలోకి అడుగుపెట్టింది.

ఈ సంఘటనతో వధువు తండ్రి సదైయాండీ కోపోద్రిక్తుడయ్యాడు. మధురై పెరియార్​ బస్​స్టాండ్​లో వరుడు శివప్రసాద్​ తండ్రి రామచంద్రన్​ను కిరాతకంగా హతమార్చాడు.

ఈ ఘటన గురించిన సమాచారం అందుకున్న పోలీసులు.. మృతదేహాన్ని పంచనామా నిమిత్తం తరలించారు. నిందితుడిని అరెస్టు చేసి దర్యాప్తును ముమ్మరం చేశారు.

ఇదీ చదవండి:బావిలో తల్లి, ముగ్గురు చిన్నారుల మృతదేహాలు.. ఏం జరిగింది?

ABOUT THE AUTHOR

...view details