Heritage trains in India: ప్రకృతి తన అందాలను ఆరబోసిన ప్రదేశం సిమ్లా. ఎటు చూసినా హిమవర్ణం, ఎత్తైన కొండలు.. పచ్చని పైన్ అడవులు, జలపాతాలు, లోయలతో సిమ్లా ప్రకృతి రమణీయతకు నిదర్శనంలా నిలుస్తుంది. ఇక్కడి ప్రకృతి అందాలను వీక్షించేందుకు పర్యటకులు భారీగా తరలివస్తున్నారు. కొండకోనల గుండా సాగే రైలు ప్రయాణంలో మంచుతో సింగారించుకున్న అందాలను చూసి మధురానుభూతి పొందుతున్నారు.
హిమాచల్‌ప్రదేశ్‌కు వచ్చిన పర్యాటకులకు రైలు ప్రయాణం ఓ మధుర జ్ఞాపకంలా మిగిలి పోతుంది. హెరిటేజ్ ట్రాక్ అందాలను చూడటానికి.. పర్యాటకులు రైళ్లలో ప్రయాణిస్తారు. దేవదార్ చెట్లు, పర్వతాల మధ్య నిర్మించిన ట్రాక్‌లో ప్రయాణించడం ఆనందాన్ని కలిగిస్తుంది. ఈ రైలు ప్రయాణం 102 సొరంగాల గుండా సాగుతుంది. క్వీన్ ఆఫ్ హిల్స్‌గా గుర్తింపు పొందిన సిమ్లాలో.. కొండల మధ్య రైలులో, ధవళవర్ణంతో మెరిసిపోతున్న పరిసరాలను చూస్తూ ముందుకు సాగడం అద్భుతంగా ఉంటుంది.