Man gifts land on moon to wife: భార్య పుట్టినరోజు సందర్భంగా ఏదైనా వెరైటీగా కానుక ఇవ్వాలనుకున్నాడో భర్త. అనుకున్నదే తడువుగా చంద్రమండలం పైన స్థలాన్ని కొనుగోలు చేసి తన భార్యకు కానుకగా ఇచ్చాడు. భర్త ఇచ్చిన సర్ప్రైజ్కు భార్య ఖుషీ అయిపోయింది. ఈ వింత సంఘటన హిమాచల్‌ప్రదేశ్‌లో జరిగింది.
భార్యకు ప్రేమతో.. చంద్రుడిపై స్థలాన్ని కానుకగా ఇచ్చిన భర్త - హిమాచల్ ప్రదేశ్ న్యూస్
Man gifts land on moon to wife: సాధారణంగా ఎవరైనా పుట్టినరోజు కానుకగా ఆభరణాలు ఇస్తారు.. వస్తువులు ఇస్తారు. కానీ ఓ వ్యక్తి మాత్రం స్థలాన్ని కొనుగోలు చేసి ఇచ్చారు. అందులో వింత ఏముంది అనుకుంటున్నారా? ఆ స్థలం కొన్నది భూమిపై కాదండి చంద్రమండలంపైన!
కంగ్రా జిల్లాకు చెందిన హరీశ్ మహాజన్ తన భార్యకు చంద్రుడిపై ఎకరం స్థలాన్ని కొనుగోలు చేసి ఇచ్చాడు. గతేడాదే కొనుగోలు చేయాలని అనుకున్నాడు. అందుకోసం ఇంటర్నేషనల్ లునార్ ల్యాండ్స్ సొసైటీకి దరఖాస్తు చేసుకున్నాడు. ఏడాది ప్రక్రియ అనంతరం.. సొసైటీ రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన పత్రాలను ఆన్లైన్లో పంపించారు. అయితే కొనుగోలు ఖర్చు చేసిన డబ్బు ఎంత అనేది మాత్రం వెల్లడించలేదు. ఇది ప్రేమకు సంబంధించిన విషయమని.. డబ్బుది కాదని చెప్పాడు. ఇలాంటి కానుక ఇస్తాడని తాను ఊహించలేదని చెప్పింది అతడి భార్య పూజ. హరీశ్ మహాజన్ హిమాచల్‌ప్రదేశ్ నుంచి చంద్రమండలం పైన భూమిని కొనుగోలు చేసిన రెండో వ్యక్తి. అంతకుముందు.. ఉనా జిల్లాకు చెందిన ఓ వ్యాపారవేత్త తన కుమారుడికి చంద్రడిపై స్థలం కొనుగోలు చేసి ఇచ్చాడు.
ఇదీ చదవండి:వలపు వలలో బ్యాంక్ మేనేజర్.. 'ఆమె'కు రూ.6కోట్లు గిఫ్ట్.. 'దొంగ లోన్'తో బడా స్కామ్!