India omicron variant: దేశంలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కలకలం సృష్టిస్తోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా 100కుపైగా కేసులు నమోదయ్యాయి. ఈ వేరియంట్ కారణంగా దేశంలో థర్డ్ వేవ్ ముుంచుకువచ్చే అవకాశాలున్నాయని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఒమిక్రాన్‌ను ఎదుర్కోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వైద్య నిపుణులు కీలక విషయాలు వెల్లడించారు. ప్రజలంతా తప్పనిసరిగా కరోనా నిబంధనలను పాటించాలని హెచ్చరిస్తున్నారు. వైరస్ వ్యాప్తిని ప్రభుత్వం నిశితంగా గమనించాలని.. కట్టడికి తగిన ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని చెబుతున్నారు.
Health experts on omicron: ఒమిక్రాన్ వేరియంట్ తక్కువ వ్యాధి తీవ్రతనే కలిగిస్తున్నప్పటికీ.. అత్యధిక వేగంతో వ్యాపిస్తుండటం ఆందోళనకర అంశమని పీఎస్ఆర్ఐ ఆస్పత్రి క్రిటికల్ కేర్ అండ్ స్లీప్ మెడిసిన్, పల్మనాలజీ ఛైర్మన్ డాక్టర్ జీసీ ఖిల్నానీ తెలిపారు. కరోనా రెండో దశలో పాటించిన జాగ్రత్తలనే మళ్లీ పాటించాల్సిన అవసరం ఉందని చెప్పారు.
"కరోనా రెండో దశ వ్యాప్తి సమయంలో పశ్చిమ ఐరోపా దేశాల్లో వైరస్ విజృంభించిన తర్వాత భారత్‌లో మహమ్మారి అధికంగా వ్యాపించడాన్ని మనం చూశాం. అందువల్ల రెండో దశ మహమ్మారి సమయంలో ఎంతటి అప్రమత్తతతో వ్యవహరించామో ఇప్పుడు కూడా అలాంటి జాగ్రత్తలే పాటించాలి."
-డాక్టర్ జీసీ ఖిల్నానీ, పీఎస్ఆర్ఐ ఆస్పత్రి.
Vaccines over omicron: "రోజులు గడుస్తున్న కొద్దీ వ్యాక్సిన్ల ద్వారా అందే రక్షణ తగ్గిపోతుంది. ఈ నేపథ్యంలో దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారికి బూస్టర్ డోసు అందించాల్సిన ఆవశ్యకత ఉంది. అత్యధిక వేగంతో ఒమిక్రాన్ వేరియంట్ వ్యాపిస్తుందని ఇప్పటివరకు ఉన్న సమాచారం ఆధారంగా తెలుస్తోంది. కానీ, భారత్‌లో నమోదైన ఒమిక్రాన్ బాధితుల్లో స్వల్ప లక్షణాలు మాత్రమే కనిపించాయి" అని డాక్టర్ ఖిల్నానీ పేర్కొన్నారు.
'థర్డ్ వేవ్ తప్పకపోవచ్చు'