వ్యాక్సిన్ తీసుకున్నామన్న విశ్వాసంతో కరోనా నిబంధనల్ని నిర్లక్ష్యం చేయకూడదని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ హెచ్చరించారు. భారత రెడ్‌క్రాస్ సొసైటీ ఛైర్మన్‌గా ఉన్న ఆయన సోమవారం పలు ప్రాంతాల్లో మాస్కులను పంపిణీ చేశారు. కరోనా అవగాహన కార్యక్రమాల్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని ఆయన అన్నారు. కరోనా సమయంలో రెడ్‌క్రాస్ సొసైటీ చర్యలను అభినందించారు. ఇప్పటికే దిల్లీలోని పలు ప్రాంతాల్లో మాస్కులను పంపిణీ చేశామని తెలిపారు. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మాస్కులు ధరించడం, భౌతిక దూరాన్ని పాటించడం వంటి నిబంధనల్ని కచ్చితంగా పాటించాలన్నారు.
'2 కోట్ల మార్కును దాటాం'