దిల్లీ సరిహద్దులో.. రైతు ఉద్యమం నేపథ్యంలో మరో రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. హరియాణాకు చెందిన 55 ఏళ్ల దిల్లీలోని టిక్రీ-బహదూర్గఢ్ సరిహద్దులో.. అతను ఆదివారం చెట్టుకు ఉరివేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఆత్మహత్య చేసుకున్న రైతు హిస్సార్ జిల్లాకు చెందిన రాజ్బిర్(55)గా గుర్తించారు.
కేంద్రం నూతనంగా తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా.. రైతులు మూడు నెలలకు పైగా ఉద్యమం కొనసాగిస్తున్నారు. చట్టాలు వెనక్కి తీసుకునేంత వరకు ఉద్యమం కొనసాగిస్తామని తేల్చిచెబుతున్నారు.