తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'భార్య, పిల్లలకు విషంపెట్టి.. భర్త ఆత్మహత్య!' - ఆత్మత్యల రేటు?

ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. గదిలో ఉరితాడుకు వేలాడుతూ శవమై కనిపించారు. కుటుంబ కలహాల నేప‌థ్యంలోనే వీరంతా బలవన్మరణానికి పాల్పడి ఉంటారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

విషాదం
విషాదం

By

Published : Sep 29, 2021, 5:22 PM IST

ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడిన ఘటన హరియాణాలోని పాల్వాల్ జిల్లా ఔరంగాబాద్ గ్రామంలో వెలుగుచూసింది. మరణించిన వారిలో ముగ్గురు చిన్నారులు కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

ఐదుగురు కుటుంబ సభ్యులు ఆత్మహత్య చేసుకున్న ఇల్లు
మృతుల బంధువులు

ఔరంగాబాద్ గ్రామానికి చెందిన నరేశ్​ కుమార్ అనే వ్యక్తి తన భార్య, పిల్లలకు విషం కలిపిన ఆహారం అందించి.. తానూ ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

"నరేష్ ఉరి వేసుకుని కనిపించాడు. అతని భార్యాపిల్లలతో పాటు వారి మేనకోడలు ఇంట్లో చనిపోయినట్లు గుర్తించాం" అని డీఎస్​పీ సజ్జన్ సింగ్ చెప్పారు. 'నలుగురు కుటుంబ సభ్యులకు విషం లేదా నిద్రమాత్రలు తినిపించి.. అతను ఉరి వేసుకున్నాడని ప్రాథమికంగా తెలుస్తోంది' అని వివరించారు.

తన కుమారుడి కాపురంలో నిత్యం ఏదో ఒక విషయంపై గొడవ జరుగుతూ ఉండేదని నరేష్ తండ్రి తెలిపారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details