తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'డేరా బాబాకు 3,500 మందితో భద్రతా? ఆయనేమైనా ప్రధాన మంత్రా?' - డేరా బాబా

Guru Granth Sahib Sacrilege Case: భారీ బందోబస్తు మధ్య గురుగ్రంథ్​ సాహిబ్​ కేసు నిందితుడైన రామ్​ రహీమ్​ను పంజాబ్​ తరలించేందుకు అతను వీఐపీ ఏం కాదని వ్యాఖ్యానించింది పంజాబ్​-హరియాణా హైకోర్టు. విచారణ జరపాల్సి వస్తే రోహ్​తక్​లోని సునారియాలో జైలులో ఉన్న నిందితుడిని కలుసుకోవాలని సూచించింది.

Guru Granth Sahib Sacrilege Case
డేరా బాబా

By

Published : Jan 6, 2022, 6:16 PM IST

Guru Granth Sahib Sacrilege Case: గురుగ్రంథ్ సాహిబ్​ అపవిత్రమైన ఘటన కేసులో నిందితుడు రామ్​ రహీమ్​ అలియాస్​ డేరా బాబాను పంజాబ్​ తరలించడంపై పంజాబ్​-హరియాణా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. భారీ బందోబస్తుతో పంజాబ్​ తీసుకెళ్లేందుకు అతను వీఐపీనో లేక ప్రధానో కాదని వ్యాఖ్యానించింది. హరియాణా రోహ్​తక్​లోని సునారియా జైలులో ఉన్న రామ్​ రహీమ్​ను 3,500 పోలీసుల భద్రత మధ్య హెలికాప్టర్​లో పంజాబ్​కు తరలిస్తామన్న ఆ రాష్ట్ర అడ్వకేట్​ జనరల్​ డీఎస్​ పాట్​వాలియా వ్యాఖ్యలపై ఈ విధంగా స్పందించింది హైకోర్టు.

ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ పంజాబ్​ పర్యటనలో భాగంగా జరిగిన భద్రతా వైఫల్యాన్ని ప్రస్తావించింది. బుధవారం ఏం జరిగిందో అందరికీ తెలుసని వ్యాఖ్యానించింది. రామ్​రహీమ్​ను విచారించాలంటే సునేరియా జైలుకు వెళ్లి అతడ్ని కలవాలని పంజాబ్​ అధికారులకు సూచించింది.

పంజాబ్​ ప్రభుత్వం ఇదివరకే 15 రోజులు గడువు అడిగిందని.. మరోసారి విచారణ వాయిదా వేయాల్సి వస్తే ఎన్నికల తర్వాత నిర్వహించాలని కోర్టుకు నిందితుడి తరపు న్యాయవాది విజ్ఞప్తి చేశారు. దీంతో కోర్టు తదుపరి విచారణను ఏప్రిల్​కు వాయిదా వేసింది. అయితే విచారణ తేదీపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు.

ఇదీ కేసు..

2015లో ఫరీద్​కోట్​లో గురుగ్రంథ్ సాహిబ్​ అపవిత్రమైన ఘటనకు సంబంధించి డేరా బాబా నిందితుడిగా ఉన్నాడు. ఇప్పటికే పలు కేసుల్లో హరియాణాలోని సునారియా జైలులో శిక్ష అనుభవిస్తున్న రామ్​ రహీమ్​ను గురుగ్రంథ్​ కేసు విచారణలో భాగంగా పంజాబ్​కు తీసుకురావాలని పంజాబ్​లోని ఫరీద్​కోట్​ కోర్టు ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. వీటిని సవాల్​ చేస్తూ నిందితుడు హైకోర్టును ఆశ్రయించాడు. ఈ క్రమంలో గురువారం విచారణ జరిపిన న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది.

ఇదీ చూడండి :రాష్ట్రపతితో మోదీ భేటీ- భద్రతా వైఫల్యంపై ఆందోళన..

ABOUT THE AUTHOR

...view details