తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అహ్మదాబాద్​ ఆశ్రమానికి వెళ్లి.. హైదరాబాద్​ యువకుడు మిస్సింగ్​ - gujarat ashram

హైదరాబాద్​ యువకుడు అహ్మదాబాద్​లో అదృశ్యమయ్యారు. ఆశారాం ఆశ్రమంలో ఓ శిబిరానికి హాజరైన ఆయన.. నవంబర్​ 11 నుంచి కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు అందింది. కుటుంబసభ్యులు కూడా అక్కడికి చేరుకొని గాలిస్తున్నారు.

Hyderabad youth goes missing from Asaram Ashram Ahmedabad
హైదరాబాద్​ యువకుడు మిస్సింగ్​

By

Published : Nov 17, 2021, 11:21 AM IST

స్నేహితులతో కలిసి అహ్మదాబాద్‌లోని ఆశారాం ఆశ్రమ సందర్శనకు వెళ్లిన హైదరాబాద్​ యువకుడు విజయ్‌ యాదవ్‌ అదృశ్యమయ్యారు. సబర్మతి ప్రాంతంలోని ఆశ్రమంలో ఈ నెల 3న ఓ శిబిరానికి హాజరై రాజస్థాన్‌లోని జోధ్‌పుర్‌లో మరో శిబిరానికి వెళ్లిన యాదవ్‌ మళ్లీ అహ్మదాబాద్‌కు వచ్చి, కనిపించకుండా పోయారు. ఫోన్‌ స్విచ్చాఫ్‌ అయింది. దీనిపై పోలీసులకు ఫిర్యాదు అందగా.. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ సభ్యులు కూడా అహ్మదాబాద్‌ చేరుకుని గాలిస్తున్నారు.

వివరాల ప్రకారం.. నవంబర్​ 11 నుంచి విజయ్​ ఆచూకీ గల్లంతైంది.

విజయ్​ యాదవ్ ​(పాత చిత్రం)

ఈటీవీ భారత్​తో మాట్లాడిన విజయ్​ కుటుంబసభ్యులు.. కన్నీరుమున్నీరవుతున్నారు. విజయ్​ అదృశ్యంపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

''నవంబర్​ 3న ఆశారాం ఆశ్రమంలో ఓ వర్క్​షాప్​లో పాల్గొనేందుకు విజయ్​ అహ్మదాబాద్​ వచ్చాడు. ఆ తర్వాత రాజస్థాన్​లోని జోధ్​పుర్​ వెళ్లాడు. మళ్లీ అహ్మదాబాద్​ ఆశ్రమానికి చేరుకున్నాడు. అప్పటినుంచి కనిపించడం లేదు. ఆశ్రమంలో రిజిస్టర్​ చెక్​ చేశాం. లోపలికి ప్రవేశించినట్లు ఉంది కానీ.. బయటికి ఎప్పటికి వెళ్లాడన్నది లేదు. అదే ఇప్పుడు ఆశ్రమం నుంచి విజయ్​ ఎటు వెళ్లాడన్నది అంతుచిక్కని ప్రశ్న. సీసీటీవీ ఫుటేజీని అడిగితే.. నవంబర్​ 11వ తేదీది మిస్​ అయిందని అంటున్నారు. పోలీసులను ఆశ్రయించి.. ఫిర్యాదు చేశాం.''

- విజయ్​ కుటుంబసభ్యులు

చాలా ఏళ్లుగా విజయ్​ కుటుంబం.. హైదరాబాద్​లో నివాసం ఉంటోంది. ఏడాదిన్నరగా విజయ్​ తరచూ ఆశ్రమాన్ని సందర్శిస్తున్నట్లు చెప్పుకొచ్చారు ఆయన సోదరుడు సంజు.

విజయ్​ యాదవ్​

అయితే.. ఈ విషయంపై ఆరా తీసేందుకు ఆశ్రమం మేనేజర్​ యోగేశ్​ భాటి, ఆయన డిప్యూటీ దినేశ్​ సాధక్​కు ఈటీవీ భారత్​ ఫోన్​ చేసేందుకు ప్రయత్నించగా వారు అందుబాటులోకి రాలేదు.

ఆశారాం ఆశ్రమం

ఇదీ చూడండి: కుమార్తెను రేప్ చేసి చంపిన తండ్రి- ప్రేమ వివాహం చేసుకుందని...

చెన్నైకు 'వరద' గండం.. బయటపడే మార్గమేది?

ABOUT THE AUTHOR

...view details