తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఆలయంలోకి ప్రవేశించారని దళిత కుటుంబంపై దాడి - Gandhidham news

ఆలయంలోకి ప్రవేశించారన్న కారణంతో ఓ దళిత కుటుంబంపై కొంతమంది దుండగులు దాడికి పాల్పడ్డారు. ఈ దారుణ ఘటన గుజరాత్​లో జరిగింది. దీనికి సంబంధించి 20 మందిపై కేసు నమోదు చేశారు పోలీసులు.

Gujarat
గుజరాత్

By

Published : Oct 29, 2021, 10:55 PM IST

గుజరాత్​ కచ్​ జిల్లా బచావు పోలీస్​స్టేషన్​ పరిధిలోని నెర్ గ్రామంలో అమానవీయ ఘటన జరిగింది. ఆలయంలోకి ప్రవేశించారన్న కారణంతో 20 మంది దుండగులు ఓ దళిత కుటుంబంపై దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు గాయపడినట్లు సమాచారం.

మంగళవారం(అక్టోబరు 26) జరిగిన ఈ ఘటనపై స్పందించిన బచావు పోలీసులు నిందితులపై ఎస్​సీ, ఎస్టీ చట్టంలోని పలు సెక్షన్​ల కింద కేసు నమోదు చేశారు. అయితే ఇప్పటివరకు ఎవ్వరినీ అరెస్ట్ చేయలేదని డిప్యూటీ ఎస్పీ కిషోర్​ సిన్హా జాలా తెలిపారు.

దుండగులు దళిత కుటుంబం పంటపొలాన్ని ధ్వంసం చేశారని, సెల్​ఫోన్​లు దొంగిలించారని, అంతేగాక రిక్షాను ధ్వంసం చేసినట్లు ఎఫ్​ఐఆర్​లో నమోదైంది.

ఇదీ చూడండి:యువతి దారుణ హత్య.. ప్రేమ వివాహం చేసుకుందని..

ABOUT THE AUTHOR

...view details