తెలంగాణ

telangana

By

Published : Nov 10, 2021, 10:45 AM IST

Updated : Nov 10, 2021, 8:27 PM IST

ETV Bharat / bharat

పాక్​ నుంచి గుజరాత్​కు భారీగా డ్రగ్స్​ దిగుమతి.. ముగ్గురి అరెస్ట్​

GUJARAT : 66 KG DRUGS SEIZED IN DEVBHOOMI DWARKA
66 కిలోల డ్రగ్స్ సీజ్.. విలువ రూ.350 కోట్లకు పైనే...

10:40 November 10

పాక్​ నుంచి భారీగా డ్రగ్స్​ దిగుమతి.. ముగ్గురి అరెస్ట్​

గుజరాత్​లోని ద్వారకలో రూ.88.25 కోట్లు విలువైన డ్రగ్స్​ను సీజ్​ చేశారు పోలీసులు. మహారాష్ట్రకు చెందిన ఓ వ్యక్తి ఈ 17.65 కిలోల హెరాయిన్​, మెథంఫిటామిన్​ల ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు పాకిస్థాన్​ నుంచి ఈ డ్రగ్స్​ను తరలిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.  

పోలీసుల వివరాల ప్రకారం..  

డ్రగ్స్​ పంపిణీ అవుతున్నాయన్న సమాచారం అందుకున్న పోలీసులు.. మహారాష్ట్ర నుంచి వచ్చిన సజ్జాద్​ ఘౌసీ అనే వ్యక్తిని మంగళవారం అరెస్ట్​ చేశారు. సజ్జాద్​ ఇచ్చిన సమాచారం మేరకు ద్వారక జిల్లాలోని సలయాకు చెందిన మరో ఇద్దరిని బుధవారం అరెస్ట్ చేశారు. కారా బ్రదర్స్​గా పేర్కొంటున్న వీరు పాక్​ నుంచి సముద్రమార్గాన అక్రమంగా వచ్చిన డ్రగ్స్​ను సజ్జాద్​కు పంపిణీ చేయాల్సి ఉంది.  

నిందితుల నుంచి 11.483 కిలోల హెరాయిన్​, 6.168 కిలోల మెథంఫిటామిన్​లను స్వాధీనం చేసుకున్నారు.  

కారా బ్రదర్స్​ ఇంట్లో సోదాలు నిర్వహించగా ఇటువంటివే మరో 47 ప్యాకెట్లు దొరికాయని అధికారులు వెల్లడించారు. అయితే ఇవేంటో తెలియాల్సి ఉందని పేర్కొన్నారు.  

అరెస్ట్​ అయిన నిందితుల్లో ఘౌసీ ఇదివరకే ఓ మర్డర్​ కేసుపైన జైలు శిక్ష అనుభవించాడని, మరో నిందితుడు సలీమ్​ కారా కూడా నకిలీ నోట్ల ముద్రణ కేసులో అరెస్ట్​ అయ్యాడని పోలీసులు వెల్లడించారు.  

Last Updated : Nov 10, 2021, 8:27 PM IST

ABOUT THE AUTHOR

...view details