తెలంగాణ

telangana

ETV Bharat / bharat

భద్రతా దళాలపై గ్రెనేడ్​ దాడి.. పౌరుడు మృతి - శ్రీనగర్​లో గ్రనేడ్​ దాడి

Grenade attack in srinagar: జమ్ముకశ్మీర్​లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. భద్రతా దళాలే లక్ష్యంగా గ్రెనేడ్​ దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఒక పౌరుడు చనిపోగా.. మరో 24 మంది తీవ్రంగా గాయపడ్డారు.

grenade
గ్రనేడ్​ దాడి

By

Published : Mar 6, 2022, 7:03 PM IST

Grenade attack in srinagar: జమ్ము కశ్మీర్​లోని శ్రీనగర్​లో ఉగ్రవాదులు గ్రెనేడ్​ దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఓ పౌరుడు చనిపోగా.. మరో 24 మంది తీవ్రంగా గాయపడ్డారు. నగరంలోని హరి సింగ్ హై ప్రాంతంలో భద్రతా బలగాలే లక్ష్యంగా సాయంత్రం 4.20 ప్రాంతంలో ఈ దాడి జరిగినట్లు పోలీసులు తెలిపారు.

ఈ దాడిలో గాయపడిన వారిలో ఒక పోలీసు సైతం ఉన్నట్లు అధికారులు తెలిపారు. క్షతగాత్రులను స్థానికంగా ఉన్న శ్రీ మహారాజా హరి సింగ్ ఆసుపత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. ఆసుపత్రికి చేరుకున్న తరువాత తీవ్రగాయాలతో ఓ వ్యక్తి చనిపోయినట్లు వివరించారు.

మృతుడు నగరంలోని నౌహట్టా ప్రాంతానికి చెందిన మహ్మద్ అస్లాం మఖ్దూమీగా పోలీసులు గుర్తించారు. ఘటన జరిగిన ప్రాంతాన్ని అదుపులోకి తీసుకున్న బలగాలు.. ఉగ్రవాదుల కోసం సెర్చ్​ ఆపరేషన్​ను ప్రారంభించినట్లు పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details