రైతుల నిరసనలపై గత కొన్ని రోజులుగా ప్రభుత్వం మౌనంగా ఉండటంపై అనుమానం వ్యక్తం చేశారు భారతీయ కిసాన్ యూనియన్ నేత రాజేశ్ టికాయిత్. ఇది సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తోన్న రైతుల్లో గందరగోళాన్ని సృష్టించడానికి సంకేతమని ఆరోపించారు టికాయిత్.
"15-20 రోజుల నుంచి రైతుల ఆందోళనలపై కేంద్రం మౌనం వహించడం చూస్తే... నిరసనలకు వ్యతిరేకంగా కుట్రలు పన్నుతున్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా సమస్యకు పరిష్కారం లభించేవరకు అన్నదాతలు వెనక్కి తగ్గరు" అని అన్నారు టికాయిత్.