పద్దెనిమిదేళ్ల లోపు వారికి టీకా (Vaccine for Children) అందించే అంశంపై శాస్త్రీయ హేతుబద్ధత ప్రకారమే కేంద్రం నిర్ణయం తీసుకుంటుందని కొవిడ్ టాస్క్ఫోర్స్ చీఫ్ వీకే పాల్ స్పష్టం చేశారు. దీంతో పాటు చిన్నారుల టీకా (Vaccine for Children in India) సరఫరాను సైతం పరిగణనలోకి తీసుకుంటామని చెప్పారు. పీటీఐ వార్తా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన.. చిన్నారులకు టీకా (Vaccine for under 18) ఎప్పుడు అందుబాటులోకి వస్తుందనేది ఇప్పుడే చెప్పలేమని అన్నారు.
"కొవిడ్ వ్యాప్తిలో చిన్నారుల పాత్ర కూడా ఉంది. వారిలోనూ అధికంగా కేసులు నమోదవుతున్నాయి. చిన్నారుల్లో కరోనా తీవ్రత తక్కువగా ఉందనేది వేరే విషయం. టీకాలు అందుబాటులోకి వచ్చినప్పుడు వారిని కాపాడుకునే ప్రయత్నం ఎందుకు చేయకుండా ఉంటాం? చిన్నారుల టీకాను (Vaccine for under 18 India) ఆమోదించే అంశం పరిశీలనలో ఉంది. సరఫరాతో పాటు, టీకా అర్హతలను బట్టి ఆచరణాత్మక నిర్ణయం తీసుకుంటాం. పిల్లలకు టీకా ఎప్పుడు వస్తుందనేది నిర్దిష్టంగా చెప్పలేం."
-వీకే పాల్, కొవిడ్ టాస్క్ఫోర్స్ చీఫ్
జైడస్ కాడిలా టీకాను (Zydus Cadila vaccine news) వ్యాక్సినేషన్ కార్యక్రమంలో భాగం చేసే కసరత్తు వేగంగా జరుగుతోందని వీకే పాల్ తెలిపారు. శిక్షణ కార్యక్రమాలు ఇప్పటికే పూర్తి చేశామని చెప్పారు. త్వరలోనే ఇది అందుబాటులోకి వస్తుందని స్పష్టం చేశారు.